ఐపీఎల్ 2022 సీజన్.. స్టార్ జట్లకే కాదు.. స్టార్ ఆటగాళ్లకు కూడా ఏమాత్రం కలిసిరావట్లేదు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, స్పీడ్ గన్ జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్.. ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ ఆటగాళ్లు ఎవ్వరూ స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా విరాట్ ఫామ్ తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఆడిన 12 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ 3 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్పందించాడు.
2008 నుంచి 2021 వరకూ మూడు సార్లు డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు సార్లు తొలిబంతికే వెనుదిరిగాడు. అందులోనూ ఎస్‌ఆర్‌హెచ్ తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ డకౌట్ గా వెనుదిరగడం గమనార్హం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్పందించాడు.
“విరాట్ కోహ్లీని ఇలా మొదటి బంతికే డకౌట్ అవ్వడం చూసి చాలా డిస్సాపాయింట్ అయ్యాను. ఈ సీజన్‌లో ఇది మూడో గోల్డెన్ డక్, ఇది నేనస్సలు ఊహించలేదు. ఈరోజు కోహ్లీ ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని అనుకున్నా.. కానీ అలా జరగలేదు. విరాట్‌ని ఇలా చూడలేకపోతున్నా.. అయితే ఇది కోహ్లీ విలువను ఏ మాత్రం తగ్గించదు. కోహ్లీ ఇప్పటికీ, ఎప్పటికీ గొప్ప క్రికెటరే. వరల్డ్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్లలో ఒకడు. త్వరలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఆడబోతోంది. వీలైనంత త్వరగా కోహ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నా. మెగా టోర్నీకి ముందు కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. టీమిండియాకి చాలా అవసరమని” రణ్‌వీర్ సింగ్ చెప్పుకొచ్చాడు.
‘Completely unexpected’: Actor Ranveer Singh disappointed after Kohli’s 3rd golden duck in IPL 2022https://t.co/Y80IJ06yLa #IPL20222 #ViratKohli #SRHvRCB pic.twitter.com/2FuUq0jkBo
— Sports Today (@SportsTodayofc) May 8, 2022
Third Golden Duck for Virat Kohli 😱
•#sportsbreeze #ipl #gujarattitans #kkr #rajasthanroyals #punjabkings #lsg #rcb #delhicapitals #srh #csk #mumbaiindians #mi #rohitsharma #ishankishan #virat #kohli #viratkohli #klrahul pic.twitter.com/Vb3YTqUeQ1
— Sports.Breeze (@thesportsbreeze) May 8, 2022
ఐపీఎల్ కెరీర్‌లో 6వేలకు పైగా పరుగులు చేసిన కోహ్లీ.. ఈ సీజన్ లో మాత్రం పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 12 మ్యాచులాడిన కోహ్లీ 216 పరుగులు చేయగా.. 58 హైయెస్ట్ స్కోర్. ఎస్‌ఆర్‌హెచ్ తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ డకౌట్ గా వెనుదిరిగిన కోహ్లీ.. లక్నో జెయింట్స్ తో జరిగిన మ్యాచులో కూడా డకౌట్ గా వెనుదిరిగాడు.
ఇది కూడా చదవండి: Virat Kohli: ముచ్చటగా మూడోసారి ‘కోహ్లీ డకౌట్’.. ఇక దేవుడే కాపాడాలి!