ఐపీఎల్‌లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ టీముల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. జయాపజయాలతో సంబంధం లేకుండా.. కోహ్లీ మార్క్‌తో ఆర్‌సీబీ అత్యంత ఎక్కువ మంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది. అందరి ఆటగాళ్ళతో పోలిస్తే కోహ్లీ ఎంత డిఫరెంట్ గా ఉంటాడో.. ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా అంతే డిఫరెంట్. అచ్చూ కోహ్లీలా వాళ్లు ఏది చేసినా వెరైటీ.. ట్రెండింగే. ఎంసీఏ వేదికగా జరిగిన ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌లో ఓ జంట చేసిన అందమైన పని అందర్నీ వారివైపు ఆకర్షించింది.
ఎంసీఏ వేదికగా చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. సీఎస్‌కే బ్యాటర్లు, ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఆర్‌సీబీ అభిమానుల్లో మ్యాచ్ ఏమవుతుందా? అన్న సందేహం. అందరి చూపు మ్యాచ్ వైపే. అదే సమయంలో లైవ్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక యువతి మోకాళ్లపై నిల్చొని బాయ్ ఫ్రెండ్‌కి ప్రపోజల్ చేయడంతో అక్కడున్న వాళ్లంతా స్టన్నయ్యారు. ఈ సన్నివేశం మన కెమెరా మ్యాన్ కంట పడటంతో ప్రపోజల్ సీన్ అయ్యే వరకూ వాళ్లను లైవ్‌లో చూపిస్తూనే ఉన్నాడు. ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడంతో.. యువతి అతని చేతికి రింగ్‌ను తొడిగి తన సంతోషాన్ని పంచుకుంది. ఆ తర్వాత వారిద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని సంతోషంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరికి నెటిజన్స్ విషెస్ చెబుతూ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.
Santhosham ga undandi🙌🏻 pic.twitter.com/houNPcolYW
— Varma (@Varma____) May 4, 2022
ఇది కూడా చదవండి: IPL 2022 GT vs PBKS: లివింగ్‌స్టోన్ భారీ సిక్స్.. బ్యాట్ చెక్ చేసిన రషీద్ ఖాన్
ఈ ఘటనపై భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా తనదైన శైలిలో కామెంట్ చేశారు. “RCBకి విధేయుడిగా ఉండగలిగితే, అతను నిస్సందేహంగా తన ప్రేయసికి విధేయుడిగా ఉంటాడని జాఫర్ వ్యాఖ్యానించడం విశేషం“.
Smart girl proposing an RCB fan. If he can stay loyal to RCB, he can definitely stay loyal to his partner 😉 Well done and a good day to propose 😄 #RCBvCSK #IPL2022 pic.twitter.com/e4p4uTUaji
— Wasim Jaffer (@WasimJaffer14) May 4, 2022
ఇక.. లవ్ ప్రపోజల్ సీన్స్ ఐపీఎల్‌లో కొత్తేం కాదు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలానే చోటుచేసుకున్నాయి. 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహర్ స్టేడియంలో ఉన్న తన ప్రేయసి వద్దకు లవ్ ప్రపోజల్ చేయడం అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇక.. ఓక సీజన్ లో లైవ్ మ్యాచ్ జరుగుతుండగా ఒక జంట ముద్దుల్లో మునిగిపోయిన సందర్భం కూడా ఉంది. మరి ఈ లక్కీ ఛాన్స్ కొట్టేసిన అబ్బాయిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
She Said Yesss 💍❤️💝💘
Deepak Chahar Marriage proposal in IPL @ChennaiIPL @deepak_chahar9#love #india #IPL2021 pic.twitter.com/hQtt6XVr34— yunesh kalum (@yunesh_k) October 17, 2021