ఐపీఎల్ 2022లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిండి. ప్రస్తుతం ఈ సీజన్‌లో 10 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడంతో పంజాబ్ కింగ్స్‌కు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్లేఆఫ్ దారులు ముసుకుపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓడితే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు ఢిలీ ఇంటిబాట పట్టనున్నాయి. గురువారం ఆర్సీబీతో గుజరాత్ టైటాన్స్ ఆడిన విధానంపై ఢిల్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
గుజరాత్ కావాలనే ఆర్సీబీతో ఓడిందని.. దీంతో ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్‌కు ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటడినా ఎటువంటి నష్టం జరగదు. ఆ జట్టు నంబర్ వన్ పొజిషన్‌లోనే ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. ప్లేఆఫ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీ ఫైనల్ లాంటి మ్యాచ్ ఆడుతాయి. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతోంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. టేబుల్‌లో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్-1లో ఆడుతాయి. గెలిచిన జట్టు తొలి సెమీస్ లాంటి మ్యాచ్‌లో ఓడిన జట్టులో మరో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని.. ఢిల్లీ లాంటి టీమ్ ప్లేఆఫ్స్‌కు రాకుంటే బెటర్ అని భావించిన గుజరాత్ టైటాన్స్ కావాలనే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓడిందని.. దీంతో ఆర్సీబీతో ప్లేఆఫ్స్ మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చిన పెద్ద ఇబ్బంది ఉండదని గుజరాత్ టీమ్ భావించి ఇలా తొండాట ఆడిందని ఢిల్లీ ఫ్యాన్స్ ఆవేదన. ఒక స్ట్రాంగ్ టీమ్ కంటే కూడా ఒక బలహీనమైన జట్టు ప్లేఆఫ్స్‌లో ఉండడం తమకు కలిసొచ్చే అంశం అని గుజరాత్ భావించినట్లు ఢిల్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక ముంబైపై ఢిల్లీ విజయం సాధిస్తే.. మెరుగైన రన్ ఉన్న కారణంగా ఆ జట్టు ప్లేఆఫ్ చేరుతుంది. ఆర్సీబీ ఇంటికి వెళ్తుంది. ముంబై విజయం సాధిస్తే మాత్రం ఆర్సీబీ సగర్వంగా ప్లేఆఫ్స్ వెళ్తుంది. మరి గుజరాత్ టీమ్‌పై ఢిల్లీ ఫ్యాన్స్ చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: ప్రపంచ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు సాధ్యం కానీ రికార్డు సాధించిన కోహ్లీ!
RCB fans praying for Mumbai Indians to win their game against Delhi Capitals pic.twitter.com/3HSAz1inzh
— ASmemesss (@asmemesss) May 19, 2022