టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కుర్ కుమారుడు అర్జున్ టెండూల్కుర్ ఐపీఎల్ 2022లో అరంగేట్రం చేయనున్నాడు. అందుకు ముంబై హో గ్రౌండ్ వేదిక కానుంది. గత ఏడాది నుంచి ముంబై జట్టులో అర్జున్ టెండూల్కుర్ సభ్యుడిగా ఉన్నా.. తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. కానీ.. ఈ సారి అతని ఎదురుచూపులకు తెరపడనుంది. సచిన్ అభిమానులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. నేడు(శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కుర్ ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగనున్నాడు.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గత మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. ఈ సీజన్‌ను గెలుపుతో ఈ లీగ్‌ను ముగించాలనుకుంటామని చెప్పాడు. అంతేకాకుండా తమ కోర్ టీమ్ పరీక్షిస్తామని, అప్‌కమింగ్ సీజన్ కోసం ఇప్పటి వరకు అవకాశం రాని యువ ఆటగాళ్లకు చోటిస్తామని తెలిపాడు. రోహిత్ చెప్పినదాట్టి బట్టి చూస్తే జట్టులో ఇప్పటి వరకు అవకాశం దక్కించుకోని ఆర్యన్ జుయాల్(వికెట్ కీపర్), అర్జున్ టెండూల్కర్(బౌలర్), ఆకాశ్ మధ్వాల్(బౌలర్), రాహుల్ బుద్ది(బ్యాటర్)లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే ఒకేసారి నలుగురి అరంగేట్ర ఆటగాళ్లతో బరిలోకి దిగే సాహసం చేయకపోవచ్చు. అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.అదే జరిగితే సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వచ్చు. లేదంటే రిలే మెరిడిత్‌ను పక్కనపెట్టవచ్చు. ఇక అర్జున్ టెండూల్కుర్‌కు జట్టులో చోటు దక్కనుండడంపై సచిన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ టెండూల్కుర్ ఆట చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా అర్జున్ టెండూల్కుర్ పేస్ బౌలర్. అతన్ని ముంబై ఐపీఎల్ మెగా వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా సచిన్ కూడా ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా ఉన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sara Tendulkar: టిమ్ డేవిడ్ రనౌట్.. స్టేడియంలో ఏడ్చేసిన సారా టెండూల్కర్!
#ArjunTendulkar could finally get a game as MI face DC in their last league game of the season at the Wankhede Stadium in Mumbai#IPL2022 #MIvsDChttps://t.co/BdwXoZNLSH
— CricketNDTV (@CricketNDTV) May 21, 2022