టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2022లో దారుణంగా విఫలం అవుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు గోల్డెన్ డక్ అయిన కోహ్లీ.. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా గోల్డెన్ డక్ అయి అభిమానులను నిరాశ పరిచాడు. దీంతో కోహ్లీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోహ్లీ కమ్ బ్యాక్ చేస్తాడని చాలా మంది మద్దతు తెలుపుతున్నా.. కోహ్లీ దారుణంగా విఫలం అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
కోహ్లీ వైఫల్యాలపై స్పందిస్తూ.. కోహ్లీకి బ్యాటింగ్ గురించి చెప్పడం అంటే.. సూర్యుడికి టార్చ్‌లైట్ చూపించడమే అంటూ సూపర్ సపోర్ట్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ కచ్చితంగా కమ్ బ్యాక్ చేస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014లో కూడా ఇలాంటి గడ్డు కాలం ఎదుర్కొన్న కోహ్లీ.. ఇంగ్లండ్‌లో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు గుర్తుచేశాడు. ఆర్సీబీ ఇప్పటికే ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి.. 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధిస్తే.. ఆర్సీబీ దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరినట్లే.. మరి ఈ మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లతోనే కోహ్లీ ఫామ్‌లోకి వస్తే.. ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీకి కొండంత బలం వస్తుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి కోహ్లీ ఫామ్‌పై, అమిత్ మిశ్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: బ్యాటింగ్‌కు వచ్చే ముందు ధోని బ్యాట్‌ని ఎందుకు కొరికాడు?
‘Giving batting advice to Virat is like showing torch to sun’: Amit Mishra backs RCB star to make strong comeback#IPL2022 #ViratKohli𓃵 #RCB https://t.co/d1sEqI4anK
— Times Now Sports (@timesnowsports) May 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.