ఐపీఎల్ 2022లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మాదాబాద్‌లో జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీ కోసం తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఆర్సీబీకి సంపూర్ణ ఆత్వవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అలాగే తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో రాజస్థాన్ రాయల్స్ కొంత నిరాశలో ఉంది. పైగా వారిపై ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే వారికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ రాయల్స్‌లో కీలక సభ్యుడిగా ఉన్న డారిల్ మిచెల్ జట్టుకు దూరం అయ్యాడు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో అతను స్వదేశానికి పయనమయ్యాడు. కాగా ఈ సీజన్‌లో డారిల్ కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి.. 33 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆర్సీబీతో శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో తుది జట్టులో ఎలాగో స్థానం ఉండదు కనుక అతను న్యూజిలాండ్ వెళ్లిపోయాడు.
తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఓడిన రాజస్థాన్.. రెండు క్వాలిఫైయర్‌లో ఆర్సీబీని ఓడించి.. ఎలాగైన ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. రాజస్థాన్‌ను మొదటి నుంచి తన బ్యాటింగ్‌తో గెలిపిస్తూ వస్తున్న జోస్ బట్లర్.. ఎలిమినేటర్‌లో తిరిగి ఫామ్‌లోకి రావడంతో ఆ జట్టుకు కొండంత బలం వచ్చినట్లు అయింది. డారిల్ జట్టుతో లేకపోయినా కూడా రాజస్థాన్‌కు పెద్దగా నష్టమేమి ఉండదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Gautam Gambhir: ఎలిమినేటర్‌లో లక్నో ఓటమిపై భావోద్వేగానికి గురైన గంభీర్.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు!