ప్రేమ పేరుతో కొందరు కేటుగాళ్లు పసి పిల్లలపై కామ కోరికలు తీర్చుకుంటూ యువతులను మోసం చేస్తున్నారు. ప్రేమిస్తున్నామంటూ వేదిస్తూ చివరికి శారీరక సంబందాలకు వెళుతున్నారు. తీరా చేసిందంత చేసి ఏం తెలియనట్టు వ్యవహరించి పరారవుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని బాపట్లలో ఓ తల్లిదండ్రులకు జన్మించింది ఓ బాలిక. భార్య, కూతురుని వదిలేసి భర్త ఏనాడో వెళ్ళిపోయాడు. ఇక తల్లి మానసిక పరిస్థితి బాగలేక ఇంటిదగ్గరే ఉంటుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో, పేదరికం వంటి కారణాలతో ఆ బాలిక కుటుంబ జీవితం కష్టగా మారింది. దీనినే ఆసరాగా భావించాడు నరసాయపాలెనికి చెందిన మణికుమార్ అనే ఆటో డ్రైవర్. బాపట్లలో పదవతరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు.
కొన్ని రోజులు ప్రేమిస్తున్నానంటూ ఆ పదహారేళ్ల బాలిక వెంటపడ్డాడు. ఇది నిజమేనని భావించిన ఆ బాలిక ఆటో డ్రైవర్ ట్రాప్ లోకి వెళ్లి పోయింది. దీంతో కొన్నాళ్ల పాటు సాగుతున్న ఈప్రేమ కథలో ఆటో డ్రైవర్ బాలికపై లైంగిక కోరికలను తీర్చుకునేందుకు వేధించేవాడు. ఇక పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా ఆ బాలికను వంచించటం మొదలు పెట్టాడు. కాగా తీరా చూస్తే కొన్ని రోజులకి ఆ బాలిక గర్బవతి అని తేలింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక మగా బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయం మనోడికి తెలియటంతో పత్తకు లేకుండా పోయాడు. దీంతో వైద్యుల సమాచారం మేరకు ఆ బాలుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
