ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య వివాహేతర సంబంధాలు నిండు జీవితాలను రోడ్డుపైకి ఈడిస్తున్నాయి. ఇలా రచ్చకెక్కిన కుటుంబాలు లెక్కలేనన్ని ఉన్నాయి. తాజాగా ఇలాంటి వివాహేతర సంబంధాల్లో తలదూర్చిన ఓ భార్య భర్త చేతితో హతమైంది. జమ్మూకశ్మీర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ లో నివాసం ఉంటున్న భార్యాభర్తలకు పెళ్లై చాలా ఏళ్ల క్రితమే అవుతుంది.
దీంతో ఇటీవల పెళ్లి వయసొచ్చిన కూతురికి వివాహం కూడా చేశారు. అయితే వివాహ అనంతరం భార్యాభర్తలు జీవితం సాఫీగా సాగినా.. భార్య తీరు మాత్రం వక్రమార్గంలోకి వెళ్లింది. ఇక 50 ఏళ్ల వయసు దాటిన ఆంటీ పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో ఈ విషయంపై పలుమార్లు భర్త మందలించే ప్రయత్నం చేసినా బుద్ది మాత్రం మారలేదు. ఇక విసిగిపోయిన భర్త ఎట్టకేలకు భార్యను చంపాలని భావించాడు. అనుకున్నట్టుగానే కత్తితో భార్య గొంతు కోసి చంపేశాడు. ఇక చివరికి విషయం పోలీసులకు తెలియటంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.