సరూర్ నగర్‌లో జరిగిన అప్సర హత్య కలకలం రేపుతుంది. పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటికొస్తున్నాయి. అప్సర హత్య కేసులో మీడియా వారు సాయికృష్ణ తండ్రితో మాట్లాడారు. అప్సర ఎవరో తమకు తెలియదని, తన కొడుకు వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన అప్సర హత్య కలకలం రేపుతుంది. ఈ నెల 3న తన ఫ్రెండ్స్‌తో భద్రాచలం వెళ్లాలనుకున్న అప్సరకు సాయికృష్ణ సెండాఫ్ ఇచ్చాడు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద దించాడు. భద్రాచలం వెళ్లిన తర్వాత అప్సర కాల్ లిఫ్ట్ చేయట్లేదని.. కంప్లైంట్ ఇచ్చాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, కాల్ డేటా ఆధారంగా పోలీసులు సాయికృష్ణ డ్రామాకు ఫుల్‌స్టాప్ పెట్టారు. పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటికొస్తున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం..
నిందితుడు సాయికృష్ణ సరూర్‌నగర్‌లో స్థానికంగా ఓ మందిరంలో పూజారిగా ఉన్నాడు. అతని పూర్తిపేరు వెంకట సాయికృష్ణ. సాయికృష్ణ అప్సర మేనమామ అని కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. కాని తను అప్సరకు మేనమామ కాదు అప్సర, సాయికృష్ణ ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరు ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తేవడంతో సాయికృష్ణ అప్సరను చంపడానికి స్కెచ్ వేశాడు.అప్సరకు ట్యాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి దించి, బండరాయితో మోది చంపేసాడు. ఆ తర్వాత సరూర్‌నగర్‌లోని మ్యాన్‌హోల్‌లో పడేసి కాంక్రీట్ వేసాడు. ఈ నెల 3న స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లాలనుకున్న అప్సరకు తానే సెండాఫ్ ఇచ్చినట్లు సాయికృష్ణ చెప్పాడు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద దించానని చెప్పాడు. ఈనెల 5న సాయికృష్ణ కంప్లైంట్ డ్రామా మొదలుపెట్టాడు. సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా సాయికృష్ణే హంతకుడిగా గుర్తించారు పోలీసులు.
అప్సర హత్య కేసులో మీడియా వారు సాయికృష్ణ తండ్రితో మాట్లాడారు. అప్సర ఎవరో తమకు తెలియదని, తన కొడుకు వ్యక్తిత్వం చాలా మంచిదని సాయికృష్ణ తండ్రి చెప్పుకొచ్చారు. అప్సరని ఒకసారి గుడిలో చూసినట్లు చెప్పాడు. అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కొడుకు సాయికృష్ణకు మరియు అక్కడ ఉన్న కుర్రాళ్లకు కూడా చెప్పినట్లు మీడియా ముందు చెప్పారు. తన కొడుకు గుడి, భక్తి , పూజలు, నిత్యాన్నదానాలు వంటి కార్యక్రమాలు చేస్తాడని, తన కొడుకు చాలా మంచివాడని అందరితో సాన్నిహిత్యంగా ఉంటాడని తెలిపారు. సాయికృష్ణ స్నేహితులు విదేశాలనుండి వచ్చినపుడు వారిని కలిసి ఇంటికి ఆలస్యంగా వస్తాడని, ఈ నెల 3న ఇంటికి ఆలస్యంగా వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటన జరిగిన విషయం తనకు తెలియదని చెప్పారు. రెండు రోజులనుండి ఎందుకో ముభావంగా ఉంటున్నాడని సాయికృష్ణ తండ్రి తెలిపారు.