ప్రపంచం అంతా టెక్నాలజీ యుగంతో పరుగులు తీస్తుంటే.. మారుమూల గ్రామాల్లోని ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. వీటిపై నమ్మకంతో ఏకంగా కన్నవాళ్లని సైతం దారుణంగా హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ తల్లి తన 6 నెలల కుమారుడిని పారతో కొట్టి చంపింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారుతోంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ ప్రాంతం. ఇక్కడే మంజూ అనే మహిళ భర్తతో పాటు నివాసం ఉంటుది. పెళ్లైన కొంత కాలం పాటు ఆ మహిళ భర్తతో బాగానే మెలిగింది. ఇదిలా ఉంటే మంజూ గత ఆరు నెలల కిందట ఓ కుమారుడిని జన్మనిచ్చింది. కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు కూడా సంతోషించారు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇటీవల ఓ మాంత్రికుడిని ఆశ్రయించింది. అయితే ఆ మాంత్రికుడి ఆదేశాల మేరకు తాజాగా ఆ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది.
మూఢనమ్మకాల నెపంతో మంజూ తన 6 నెలల కుమారుడిని చంపాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమారుడిని పారతో దారుణంగా కొట్టి చంపింది. ఇదే సమయంలో ఆ బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంజూ ఇంట్లో వెళ్లి చూడగా.. ఆ బాలుడు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు ఏం జరిగిందని ఆ మంజూను నిలదీయగా.. అసలు నిజం వెల్లగక్కింది. మూఢనమ్మకాల కారణంగానే నా కుమారుడిని చంపానని తల్లి మంజూ ఎట్టకేలకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూఢనమ్మకాలతో కన్న కొడుకుని దారుణంగా హత్య చేసిన ఈ కసాయి తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.