భార్య విచ్చల విడి తనాన్ని భరించలేకపోయిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. పరాయి మగాళ్లతో సంబంధం కొనసాగిస్తున్న ఆమెను హత్య చేశాడు. తలను శరీరం నుండి వేరుచేసి, శరీరాన్ని ముక్కలు చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, సీతాపూర్‌లోని లూనా గ్రామానికి చెందిన పంకజ్, జ్యోత్స్న భార్యాభర్తలు. జ్యోత్స్న మత్తు పదార్థాలకు అలవాటు పడింది. ఈ కారణంతోనే చాలా సార్లు ఇంటినుంచి పరారైంది. దానికి తోడు ఆమెకు గ్రామంలోని చాలా మంది మగాళ్లతో సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన పంకజ్ చాలా సార్లు ఆమెను హెచ్చరించాడు. కానీ, ఎప్పుడూ మత్తులో ఉండే ఆమె ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో పంకజ్ భార్య ప్రవర్తనతో విసిగిపోయాడు.
తనమాట వినని, తప్పుడు పనులు చేసే భార్య తనకు వద్దు అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను చంపటానికి ప్లాన్ వేశాడు. ఇందుకోసం అతడి మిత్రుల సహాయం తీసుకున్నాడు. నవంబర్ 9న పంకజ్, అతడి ఇద్దరు మిత్రులు జ్యోత్స్నను హత్య చేశారు. తర్వాత ఆమె తలను మొండెం నుంచి వేరు చేశారు. మొండెంతో పాటు ఇతర భాగాలను ముక్కలు చేశారు. వాటిని ఓ సంచిలో పేడిసి, దగ్గరలోని అడవికి తీసుకెళ్లారు. అక్కడ ఆ సంచిని పడేశారు. అడవిలోకి మరికొంత దూరం వెళ్లిన తర్వాత తలను రాయితో కొట్టి గుర్తు పట్టకుండా చేశారు. తర్వాత దాన్ని అక్కడే పడేశారు. కొన్నిరోజుల తర్వాత అటుగా వెళుతున్న కొంతమంది సంచిలోంచి వాసన వావటం గమనించారు.
దగ్గరకు వెళ్లి చూడగా అది ఓ శవం అని తేలింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల అక్కడికి వెళ్లి సంచిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, అందులో తల లేకపోవటం గుర్తించారు. తల కోసం వెతకటం మొదలుపెట్టారు. దాదాపు 18 గంటలు కష్టపడి తలను వెతకి పట్టుకున్నారు. దాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల ఆధారణంగా జ్యోత్స్న చిత్రాన్ని గీయించారు. తర్వాత మిస్సింగ్ కేసుల ఆధారంగా చేసుకుని పంకజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.