10వ తరగతి చదువుతున్న బాలిక రోజు లాగే స్కూల్ కు వెళ్లింది. సాయంత్రం 5 దాటినా ఇంకా ఇంటికి రాలేదు. అయితే బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని బాలిక తల్లిదండ్రులు అందరికి సమాచారాన్ని అందించారు. కూతురు జాడే తెలియలేదు. ఏం జరిగిందంటూ భయంతో హుటాహుటిన స్థానిక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి మా కూతురు కనిపంచడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు. అటు నుంచి ఇంటికొచ్చి ఆ బాలిక తండ్రి మొబైల్ ఫోన్ చూశాడు. సడెన్ గా నెట్టింట్లో కూతురి ఫోటో చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురై అక్కడే కుప్పకూలిపోయారు.
తాజాగా వరంగల్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ బాలిక తల్లిదండ్రులకు నెట్టింట్లో కనిపించిన కూతురి ఫోటోలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామం. ఓ దంపతులకు 10వ తరగతి చదివే కూతురు ఉంది. రోజు లాగే స్కూల్ వెళ్లి వచ్చేది. అలా వెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓర్సు కార్తిక్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అలా ఒకరినొకరు ఇష్టపడడంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు.దీంతో రోజు ఫోన్ లో మాట్లాడుకోవడం, అక్కడక్కడ కలుసుకోవడం కూడా చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్ది వీరి ప్రేమ మరింత ముదిరిపోయింది. అయితే ఇటీవల స్కూల్ కు వెళ్లిన ఆ బాలిక పాఠశాల నుంచి కార్తిక్ తో వెళ్లిపోయింది. అలా వెళ్లిన వీరిద్దరూ కొమ్మాల గుడిలో పెళ్లి చేసుకుని తల్లిదండ్రులక కనిపించకుండా దూరంగా వెళ్లారు. ఇక సాయంత్రమైన కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.
మీరు ఈ క్రైమ్ వార్తలు చదివారా?
ఇక మరుసటి రోజే వాట్సప్ లో, సోషల్ మీడియాలో కనిపంచకుండా పోయిన ఆ బాలిక, యువకుడు పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వారిద్దరి పెళ్లి ఫోటోలు కాస్త వైరల్ గా మారి వీరిద్దరి పెళ్లి విషయం మండలం మొత్తం పాకింది. కూతురు పెళ్లి చేసుకున్న ఫోటోలను చూసిన ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక మైనర్ బాలిక కావడంతో తల్లిదండ్రులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా సంగెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.