ఓ అమాయక భర్తను పెళ్లైన కొన్నాళ్లకే భార్య నట్టేటముంచిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఏకంగా భర్తకు తెలియకుండా నవరసాలు పండించి భర్తకు కోలుకోలేని షాకిస్తూ ఇంట్లో నుంచి పరారైంది. ఇక విషయం ఏంటంటే..? అది చెన్నైలోని కోయంబత్తూర్ కనువాయి ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన విఘ్నేష్ అనే యువకుడితో యామిని అనే యువతిని ఇచ్చి వివాహం చేశారు. పెద్దలు కుదుర్చిన వివాహం కావడంతో వీరి పెళ్లి ఘనంగానే జరిగింది.
ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్ది వీరి కాపురం కొన్ని రోజులు సజావుగానే సాగింది. కాగా వీరి పెళ్లై రెండున్నర నెలలు కావొస్తుంది. ఇంతలోనే భార్య యామిని ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. భార్య అందంగా ఉందని భర్త కాస్త మురిసిపోయాడేమో. ఇక మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? యామినికి గతంలోనే శివకుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతనితో ఉంటూనే రెండె పెళ్లికి సిద్దపడిందీ సోకుల సుందరి. అయితే కొత్తగా పెళ్లైన పెళ్లి కూతురని విఘ్నేష్ తల్లిదండ్రులు కూడా పెద్దగా కనిపెట్టలేకపోయారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంతలోనే భర్తకు, అత్తింటివాళ్లకు షాకిస్తూ ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు అంతా సర్దుకుని కనిపించకుండా మొదటి భర్త శివకుమార్ వద్దకు చెక్కేసింది. ఇక కంగారు పడ్డ భర్త అటు ఇటు అంతా వేతికాడు. ఎక్కడా కూడా తన భార్య యామిని జాడ కనిపించలేదు. దీంతో ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. ఏం చేయాలో అర్థంకాక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసుల విచారణలో మాత్రం తన భార్యకు ఇంతకు ముందే పెళ్లైందని, ఇప్పుడు మొదటి భర్తకు వద్దకు వెళ్లిందని తేలడంతో భర్త విఘ్నేష్ కు దిమ్మతిరిగింది. ఇక తట్టుకోలేని విఘ్నేష్ పెళ్లైన ఫోటోలతో సహా పక్కా ఆధారాలతో భార్య యామినితో పాటు ఆమె తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈజీ మనీ కోసం ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఈ మాయలేడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.