రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. డబ్బు కోసం తల్లి ఏకంగా కన్న కూతురినే వ్యభిచారం ముఠాలోకి పంపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చోరురు పరిసర ప్రాంతంలో ఓ కూతురితో పాటు తల్లి నివాసం ఉంటుంది. అయితే గతంలోనే భర్తతో వచ్చిన విభేదాల కారణం భర్త ఆమెను వదిలేసి దూరంగా ఉంటున్నాడు. దీంతో కుటుంబ పోషణ మొత్తాన్ని ఆ వివాహిత భరిస్తుంది.
ఇక డబ్బు లేకపోవడంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమయంలో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. వయసుకొచ్చిన కూతురి ఉంది డబ్బున్నోడికి అమ్మేస్తే వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయొచ్చని ఆలోచన కలిగింది. అదే ఆలోచనను అమలు చేసిన ఆ వివాహిత అనుకున్నట్లుగానే కూతురిని ఉన్నోడికి అమ్మేసింది. కొంత కాలం అక్కడే ఉన్న ఆ యువతిని ఆ వ్యక్తి శారీరకంగా వాడుకున్నాడు. ఇక డబ్బులు మొత్తం ఆ వివాహితకు చేరకపోవడంతో గొడవపడి తన కూతురిని మళ్లీ తీసుకెళ్లింది.
ఈ క్రైమ్ వార్తలు చదివారా?ఇక ఆ తర్వాత మెల్ల మెల్లగా తన కూతురిని వ్యభిచారంలోకి నెట్టేసింది. అలా వెళ్లగా వచ్చిన డబ్బులతో తల్లి తెగ జల్సాలు చేస్తూ వస్తుంది. కొన్నాళ్ల నుంచి తల్లి చేస్తున్న దారుణాలను కూతురు భరించలేకపోయింది. దీంతో ఇంటి నుంచి పరారైన కూతురు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా తల్లి తనపై చేయిస్తున్న ఘోరాలను తట్టుకోలేకపోతున్నానని వివరించింది. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తల్లిని పట్టుకునేందుక ప్రయత్నించినా తన ఆచూకి ఎక్కడ కూడా లభించలేదు. ఇక ఆ దుర్మార్గురాలి కో్సం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక కన్న కూతురిపై తల్లి చేసిన ఘోరాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.