విహహం జరిగిన 11 ఏళ్లకు గర్భం దాల్చింది ఓ తల్లి. ఇంక ఆ తల్లి ఆనందానికి అవధులేవు. తనకు పుట్టబోయే బిడ్డపై ఎన్నో ఊహలు పెట్టుకుంది. ఆమె అనుకున్నట్లుగానే పండంటి మగబిడ్డ పుట్టిండు. ఆమెకు సిజేరియాన్ ద్వారా బాబు జన్మించాడు. సిజేరియానైనా కొడుకు పుట్టాడన్న ఆనందంలో నొప్పిని భరించింది. వైద్యుల నిర్లక్ష్యంతో.. పలుమార్లు వేసిన కుట్లు నయంకాకపోవడంతో, ఇన్ ఫెక్షన్ సోకడంతో నొప్పి భరించలేక ఓ మహిళ ఆస్పత్రిలోని ప్రసూతి వార్లులోని బాత్ రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమ(29)ను ప్రసవం కోసం ఈనెల11న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేసి వైద్యులు మగబిడ్డకు పురుడు పోశారు. సిజేరియన్ చేసిన వైద్యలు కుట్లు సరిగ్గా వేయలేదో ఏమోగానీ అవి అతుక్కోలేదు. దీంతో ఇన్ ఫెక్షన్ వచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇలా రెండు సార్లు కుట్లు వేసిన వైద్యలు, అయినా అది నయం కాకపోవడంతో మరోసారి వేయాలని ఆమెకు తెలిపారు. దీంతో అప్పటికే కుట్లు వేసిన ప్రాంతంలో భరించలేని నొప్పి రావడంతో ఉమ.. ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులోని బాత్ రూమ్ లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉమ మృతిపై డీసీహెచ్ ఎస్ డాక్టర్ వాసుదేవరరెడ్డి ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. మృతురాలి భర్త సంజీవ్ తో మాట్లాడారు. నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తామని డీసీహెచ్ ఎస్ తెలిపారు. ఏది ఏమైనప్పటికి కొందరి నిర్లక్ష్యం కారణంగా ఓ బాలిత ప్రాణం పోయింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.