నేటి కాలంలో కొందరు యువకులు శారీరక సుఖానికి అలవాటు పడి వివాహితల ట్రాక్ లో పడిపోతున్నారు. ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. వీలైతే పెళ్లైన ఆంటీలతో గడపడం, తిరగడం వంటివి చేస్తూ చివరికి ఆ వివాహితల చేతులోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి కథలోకి వెళ్తే.. కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో చందా ఎల్లారావు అనే యువకుడు నివసిస్తు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూండేవాడు.
అయితే అలా రోజు వారి కూలీలు పనికి తీసుకెళ్తే మహిళ కూలీలతో సరదగా గడిపేవాడు. ఈ క్రమంలోనే బానోత్ శివపార్వతితో అనే వివాహితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో వీరిద్దరూ కొన్నాళ్ల పాటు శారీరక సుఖాలు తీర్చుకుంటూ తెగ ఎంజాయ్ చేసేవారు. ఈ సమయంలోనే ఆ యువకుడు ఆ వివాహిత అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం, పిలిచిన ప్రతీసారి ఇంట్లోకి వెళ్లటం చేస్తుండేవాడు. అయితే కొంతకాలానికి ఆ యువకుడు మద్యానికి అలవాటు పడి ఆ వివాహితను వేధించటం, కొట్టడం చేస్తుండేవాడు.
దీనిని భరించలేకపోయిన వివాహిత బానోత్ శివపార్వతి భర్త సాయంతో ఆ యువకుడిని అంతం చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే ఇటీవల ఓ రోజు రాత్రి ఎల్లారావు మద్యం సేవించి తన ప్రియురాలైన శివపార్వతి ఇంటికి వెళ్లి తలుపులు తట్టాడు. దీంతో మాటు వేసిన శివపార్వతి భర్త తలుపులు తీయగానే ఎల్లరావు మేడపై కర్రతో బలంగా బాదాడు. దీంతో ఎల్లారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక తెలివిగా చంపినట్లుగా మా మీదకు రాకుడదని భావించిన వివాహిత భర్త తెల్లవారు జామున తన ఆటోలో వేసుకుని గ్రామం చివరన పడేశారు. ఇక గ్రామస్తుల ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టగా చివరికి నిందితులు భార్యాభర్తలు అని తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.