నేటి కాలంలో రోజు రోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. మనిషిని చంపడం అంటే చీమను నలిపినంత సులువుగా చంపేస్తున్నారు. కొందరికైతే ప్రాణం అంటే విలువ లేకుండా దారుణాలకు తెగబడ్డుతున్నారు. తాజాగా కేరళ లోని కొట్టాయంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపిన రౌడిషీటర్.. అనంతరం డెడ్ బాడీని భుజంపై మోసుకొచ్చే పోలీస్ స్టేషన్ ముందు పడేశాడు. తానే హత్యచేసినట్లు పెద్ద కేకలు వేసి పోలీసులుక లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..
ఇది కూడా చదవండి:
ప్రిన్స్ పాల్ ని పిచ్చి కొట్టుడు కొట్టిన ప్రొఫెసర్..!
కేరళలోని కొట్టాయం ప్రాంతంలో జోమోన్ కెస్ అనే రౌడీ షీటర్ గంజాయి, డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే షాన్ బాబు(19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలం నుంచి పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి షాన్ బాబును తన ఇంట్లో నుంచి జోమోన్ తీసుకెళ్లాడు. భయాందోళన చెందిన షాన్ తల్లి కొట్టాయం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి వీరిద్దరి కోసం గాలి పోలీసులు గాలిస్తున్నారు.
ఈ క్రమంలోనే జోమోన్ షాన్ బాబును చిత్ర హింసలకు గురిచేస్తూ పోలీసులకు చిక్కకుండా.. ఆటోలో కొట్టాయం మొత్తం తిప్పాడు. చివరికి షాన్ చనిపోయాడని భావించిన అనంతరం మృతదేహాన్ని భుజంపై వేసుకోని పోలీస్టేషన్ కి వెళ్లాడు. పోలీస్ స్టేషన్ ముందు షాన్ మృతదేహాన్ని పడేసి.. నేనే చంపినట్లు గట్టిగా కేకలు వేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. జోమోన్ గతంలో కూడా పలు హత్య కేసులు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరి.. ఒక మనిషిని ఇంత అమానుషంగా కొట్టి చంపిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలనుకామెంట్స్ రూపంలో తెలియజేయండి.