యువతికి 32 ఏళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో ఎలాంటి వివాదాలు, విభేదాలు లేకుండా సాఫీగా సాగుతున్న వైవాహిక జీవితం. కట్ చేస్తే.. వీరి కథలో ఊహించని పరిణామం ఎదురై భార్య నిర్మానుష్య ప్రాంతంలో భర్తను, పిల్లలను కాదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అసలు ఈ 32 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు గల కారణం ఏంటీ? ఎలాంటి గొడవలు లేని సంసారంలో వివాహిత ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతం. 32 ఏళ్ల వివాహితకు పెళ్లైంది. భర్తతో పాటు హాయిగా సాగుతున్న వీరి కాపురంలో కొంత కాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఎలాంటి వివాదాల మచ్చలేని కుటుంబం కావడంతో ఎంతో సంతోషంగా పిల్లలతో కలిసి మెలిసి జీవిస్తున్నారు. అలా రోజులు గడుస్తున్న కొద్ది భార్య భర్తను కాదని పక్క చూపులు చూసింది. తను పని చేసే కంపెనీలోని 22 ఏళ్ల యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఒకరినొకరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తున్నారు. వీరిద్దరు శారీరకంగా కూడా కలుసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకుందామంటే సమాజం, కుటుంబం అంగీకరించదు. ఏం చేయాలో ఇద్దరికి అర్థం కాని పరిస్థితులు ఎదురయ్యాయి. జీవితాంతం కలుసుందామని అనుకుంటున్నా, భర్త, పిల్లల కారణంగా సాధ్యం కానీ పని. ఇక మంగళవారం రాత్రి ఇద్దరు డ్యూటీలు ముగించుకుని వికారాబాద్ లోని పూడూరు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతంలోని నీలగిరి తోటకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. తాజాగా జరిగిన ఈ ఘటనతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.