మద్యం.. ఇది మనుషులను ఎందాకైన తీసుకెళ్తుంది. సాఫీగా సాగుతున్న పచ్చటి సంసారంలో కొందరు తాగుడుకు బానిసై జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలా మద్యానికి బానిసై ఓ భర్త భార్యను వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించిన భార్య భర్తను కడతేర్చింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో ఉన్న హన్మకొండలోని రెడ్డి కాలనీలో గన్నేరు గౌరి శంకర్ కు ఓ మహిళతో గతంలో వివాహం జరిగింది.
కొంత కాలం వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. ఇక రోజులు గడిచే కొద్ది భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రతీ రోజు మద్యం తాగడం, ఇంటికొచ్చి భార్యను వీధించటం అలా కొన్నాళ్ల పాటు వేదిస్తూ వచ్చాడు. ఇక ఇంత కాలం భరించిన భార్య.. భర్త ఆగడాలు పెచ్చుమీరడంతో తట్టుకోలేకపోయింది. ఇక ఏం చేయాలో తెలియక భర్తను అంతమొందించేందుకు పథకం రచించింది.
ఇక ప్లాన్ ప్రకారమే ఆదివారం రాత్రి భార్య భర్త గౌరి శంకర్ ను తన సోదరుడి సాయంతో రాడ్ తో కొట్టి దారుణంగా హత్య చేసింది. అనంతరం భర్త వేదింపులకు భరించలేకే ఇలా చేశానంటూ పోలీసుల ఎదుట భార్య లొంగిపోయింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక భర్త ఆగడాలను భరించలేక మహిళ భర్తను హత్య చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.