పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటికి 32 మంది మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాలిలోని బండియాగ్రా ప్రాంతంలో శుక్రవారం బస్సులో మార్కెట్ కు కొంత మంది ప్రయాణికులు వెళ్లారు. దీంతో రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఉగ్రవాదులు ముందుగా డ్రైవర్ ను తుపాకితో కాల్చేశారు. ఆ తర్వాత మెల్లగా బస్సు టైర్ లలో గాలి తీసేసే కొద్ది సేపు ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించారు.
ఉగ్రవాదులు కొద్ది సేపటికి తమ వద్ద ఉన్న తుపాకులతో బస్పులో ఉన్న ప్రయాణికులపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్సుల్లో ఇప్పటికీ డ్రైవర్ తో సహా 32 మంది ప్రయాణికులు మరణించగా, మిగత ప్రయాణికులు తీవ్ర గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు బస్సును పెట్రోల్ పోసి తగలబెట్టి బీభత్సం సృష్టించారు. ఎక్కడికక్క మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. పశ్చిమాఫ్రికా దేశంలో మాలిలో తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.