భార్యాభర్తల అన్యోన్య జీవితంలో అనుమానం చేరి నిండు జీవితాలను ఆగం చేస్తుంది. ఇలాంటి అనుమానమే పెను శాపంగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలితీసేలా చేసింది. ఇక విషయం ఏంటంటే..? ఆ మహిళ పేరు సురేఖ. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఈడిగపల్లి సమీపంలో ఉన్న యాతాలవంకకు చెందిన ఈ మహిళ మధనపల్లెలోని మంజునాథ కాలనీలో నివాసం ఉంటుంది. స్థానికంగా అంగన్వాడిలో ఆయాగా పని చేస్తున్నసురేఖకు గతంలోనే వివాహం అయింది.
అయితే భర్తతో మనస్పర్ధలు రావడంతో అక్కడికి అతడితో ఉన్న రిలీషన్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న సురేఖ కొంత కాలం తర్వాత ఎల్లప్ప అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నేళ్లు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోయింది. ఇక గత రోండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య అనుమానపు మనస్పర్థలు భగ్గుమన్నాయి.
ఈ నేపథ్యంలోనే భర్త ఎల్లప్ప భార్యను అనుమానంలా చూసేవాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు మరింత తీవ్ర తరం అయ్యాయి. ఇక ఓ రోజు సురేఖ ఇంటికి ఆలస్యంగా రావడవంతో రెండవ భర్త ఎల్లప్ప ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఇంత కాలం భరించినా సురేఖ ఈ విషయంలో భర్తకు ఎదురుతిరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎల్లప్ప అక్కడే ఉన్న టైలర్ సీజర్ తో భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఇక విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు ఇంటికొచ్చి చూసే సరికి సురేఖ రక్తపు మడుగులో పడి ఉంది. ఇక వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఫలితం దక్కక సురేఖ ప్రాణాలు విడిచింది. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు ఎల్లప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.