ఈ మద్య మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధిపులు మాత్రమే కాదు హత్యలకు తెగబడుతున్నారు. ఒకదశలో ఒంటరిగా మహిళల బయట తిరగాలంటేనే భయపడిపోతున్నామిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళా సంఘాలు.
ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులే కాదు.. హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ విడిచి పెట్టడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. రైల్వే స్టేషన్ లో ఓ డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం రేగింది. ఈ ఘటన బెంగుళూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూరు సిటీ నుండి 13 కిలోమీటర్ల దూరంలో బైయప్పనహళ్ళిలో రైల్వే స్టేషన్ లో మహిళా మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం 10 సమయంలో బైయప్పనహళ్ళి రైల్వే స్టేషన్ ఎంట్రీ గేట్ వద్ద ఒక డ్రమ్ములో మహిళా ప్రయాణికురాలి మృతదేహం అనుమానాస్పద పరిస్థితిలో కనిపించింది. ఆ మృతదేహాన్ని బట్టలతో కప్పి డ్రమ్ములో కుక్కిపెట్టారు. ఈ విషయాన్ని స్థానికులు, రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు డమ్ములో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. ఆ మహిళ వయసు 35 సంవత్సరాలు ఉంటుందని.. అంచనా వేశారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. ఇక పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి. ఆ మహిళను ముగ్గురు వ్యక్తులు ఈ డ్రమ్ లో తీసుకు వచ్చి రైల్వే గేట్ వద్ద విడిచి వెళ్లినట్లు గుర్తించారు. అయితే ఆ మృతదేహం ముగ్గురు దుండగులు మచిలీపట్నం నుంచి రైల్లో తీసుకు వచ్చినట్లు వెల్లడించారు. ముగ్గురు దుండగులు ఎవరు? ఆ మృతదేహం ఎవరిదీ అన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతుందని.. ఇప్పటికే ఓ బృందాన్ని రంగంలోకి దింపినట్లు ఎస్పీ సౌమ్లత తెలిపారు. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు. రెండు నెలల క్రితమే ఈ రైల్వే స్టేషన్ వద్ద ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
