నేటి కాలంలోని కొందరు మగాళ్లు వయసు పెరిగినా బుద్ది మాత్రం అస్సలు మారటం లేదు. మద్యం మత్తులో బరితెగించి ప్రవర్తిస్తూ అడ్డొచ్చిన 6 ఏళ్ల పాప నుంచి 95 ఏళ్ల ముసలవ్వల వరకు ఎవరిని వదలకుండా కామంతో రెచ్చిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమడగూరు పరిధిలోని ఓ తండాలో 95 ఏళ్ల వృద్ధురాలు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది.
అయితే ఆదివారం కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లడంతో ఆ ముసలవ్వ ఇంటి దగ్గరే ఉంది. కాగా ఇదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామాంజులు నాయక్ మద్యం సేవించి రోడ్డుపై అటుగా వెళ్తూ ఇంట్లో ఉన్న ఆ ముసలవ్వ వద్దకి వెళ్లాడు. ఇక దీంతో ఆగకుండా కామంతో కళ్లునెత్తికెక్కి వృద్ధురాలు అని చూడకుండా క్రూరత్వంతో ఆమెపై అత్యాచారం చేశాడు. వెంటనే ముసలవ్వ ఒక్కసారిగా అరుపులు వేయడంతో ఏం జరిగిందంటూ అక్కడే ఉన్న స్థానికులు ఇంట్లోకి పరుగులు తీశారు.
ఇక అక్కడ జరిగిన సీన్ చూసి అంతా షాక్ కు గురయ్యారు. కోపంతో ఊగిపోయిన కొందరు యువకులు నిందితుడి చొక్కా పట్టి బయటకు లాగి చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బామ్మ కుటుంబ సభ్యులు నిందితుడు రామాంజులు నాయక్ పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక 95 ఏళ్ల వృద్ధురాలిపై కామంతో బరితెగించి ప్రవర్తించిన పెద్ద మనిషి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.