మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమని అందరికి తెలుసు. అయిన తాగి వాహనాలను నడుపుతుంటారు. దీని వలన జరిగే ప్రమాదాల్లో వారి ప్రాణాలే కాకా, అమాయకులు ప్రాణాలు కొల్పోతారు. అలా అమెరికాలో లాస్ ఏంజెలెస్ లో 20 ఏళ్ల యువతి మద్యం మత్తులో వాహనం నడిపి చేసిన ప్రమాదంలో ఇద్దరు తెలుగు వ్యక్తి మృతిచెందారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ ప్రమాదం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లాలోని లింగాలఘణపురానికి చెందిన రామచంద్రారెడ్డి 16 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ఆయనకు అర్జిత్ రెడ్డి, అక్షిత రెడ్డి అనే కొడుకు, కూతురు ఉన్నారు. రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులందరికి అమెరికా పౌరసత్వం లభించింది. ఈనెల 18న స్నేహితుడి జన్మదిన వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ.. సిగ్నల్ దగ్గర ఆపిన రామచంద్రారెడ్డి కారును మద్యం మత్తులో కారు నడుపుతూ.. వచ్చిన ఓ 20 ఏళ్ల యువతి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అర్జిత్ రెడ్డి ఘటన స్థలంలోనే మృతిచెందగా. కొన ఊపిరితో ఉన్న అక్షితారెడ్డికి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. శనివారం రాత్రి ఆమె మరణించినట్లు వైద్యుల తెలిపారు. రామచంద్రారెడ్డి దంపతులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో..వారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ప్రమాదానికి కారణమైన మహిళను అరెస్టు చేసి, ఆమెపై హత్యానేరం అభియోగాలు మోపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో జరిగిన ఈ ప్రమాదంతో ఓ యువతి జైలు వెళ్లింది. దేశాలు దాటి వచ్చి హాయిగా బ్రతుకుతున్న ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిజేయండి.