సమాజంలో పరిస్థితులను చూస్తుంటే ఎంత దారుణంగా తయారవుతున్నాయె అర్థం కానీ పరిస్థితి. అటు ఆరెళ్ల బాలికల నుంచి ఇటు పెళ్లైన వివాహిత వరకు ఇలా వయసులతో సంబంధం లేకుండా చేస్తున్న హత్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇక ఇదే కాకుండా ఆస్తుల కోసం, వరకట్న వేధింపులు ఇలా ఒకటేంటి ఏ కేసులె చూసిన దుర్మార్గులు రాజ్యమేలుతున్నారు. ఇక తాజాగా అత్తమామలను ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్ బీ లోని జేఎన్టీయూ సమీపంలో నివాసముంటున్న దంపతుల కుమార్తెను సాయికృష్ణకు అనే వ్యక్తికి ఇచ్చి గతంలో ఘనంగా వివాహం చేశారు. అయితే కొన్నాళ్లపాటు వీరి దాంపత్య జీవితం సాఫిగానే సాగినా.. రాను రాను వీరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో భర్త గురి చేసే వేధింపులను తట్టుకోలేని కూతురు తల్లిదండ్రలుకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
తనపై అత్తమామ కంప్లెయింట్ ఇచ్చారని తెలుసుకున్న అల్లుడు సాయికృష్ణ అవమానాన్ని తట్టుకోలేక పోయాడు. నా పరువు పోయిందని భావించి కోపంతో అల్లుడు తాజాగా ఓ రోజు అర్ధరాత్రి అత్తమామల ఇంటికి వెళ్లాడు. ఇక వెళ్లటంతో పాటు తన వెంట పెట్రోల్ తీసుకెల్లి దారుణంగా పడుకున్న అత్తమామపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. దీవ్రగాయాల పాలైన ఆ భార్యభర్తలను స్థానికులు గమనించి వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు సాయికృష్ణపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.