తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ చినిగి చినిగి చివరికి ప్రాణాలు పోయేలా చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తిరుపతి బాలాజీ జిల్లా పిచ్చటూరు గ్రామానికి చెందిన అర్జున్, తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన దినేష్ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు. కొంత కాలం నుంచి వీరు మంచి స్నేహితులుగా మారారు.
అయితే తిరువళ్లూరు జిల్లా పాక్కంలోని ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న యువతులతో వీరిద్దరూ ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అయితే దినేష్ ప్రియురాలి గురించి స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన దినేష్ అర్జున్ పై పగ పెంచుకున్నాడు. ఇక ఎలాగైన సరే అర్జున్ ను హత్య చేయాలని ప్లాన్ గీశాడు. ఇక ఇందులో భాగంగానే ఘటన జరిగిన రోజు దినేష్, అర్జున్ కలిసి ఓ చోట మద్యం సేవించారు. మద్యం మత్తులోకి జారుకున్నాక.., వీరిద్దరి మధ్య మరోసారి గొడవ రాజుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన దినేష్ అర్జున్ ను దారుణంగా హత్య చేశాడు.
అనంతరం అతడి శవాన్ని తిరునిండ్రవూర్ రైల్వే స్టేషన్ లో పై పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే మొదట్లో అర్జున్ ది ఆత్మహత్య అని అందరూ భావించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడి మృతదేహాన్నిపోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు దినేష్ అర్జున్ ను హత్య చేశాడని తేల్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.