crime news : రేపటి పౌరులు కావాల్సిన నేటి బాలలు చిన్న చిన్న వాటికే తట్టుకోలేని మానసిక స్థితికి చేరుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి ప్రాణం తీసుకుంటున్నారు. ఓ బాలిక టీచర్ పనిష్‌మెంట్ విధించాడనే బాధతో ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. స్కూలు మొత్తం షాక్‌కు గురయ్యేలా.. రెండవ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నమక్కల్ జిల్లా తిరుచెన్‌గోడ్‌కు చెందిన బాలిక అక్కడి పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
శనివారం మధ్యాహ్నం లంచ్ చేసి ఆలస్యంగా క్లాసుకు వెళ్లింది. దీంతో తమిళ క్లాసు టీచర్ బాలికతో పాటు లేటుగా వచ్చిన వారిని బయట నిలబెట్టాడు. బాలిక స్కూలు రిప్రజెన్‌టేటివ్ అవ్వటంతో లేటుగా వచ్చినందుకు ఆ బాధ్యతలు మరోకరికి అప్పగిస్తానని చెప్పాడు. దీంతో బాలిక తట్టుకోలేకపోయింది. అందరి ముందు తన పరువు పోయినట్లు భావించింది. వాంతికి వస్తోందని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఎంత సేపటికి బాలిక తిరిగిరాలేదు. టీచర్ కొంతమంది విద్యార్థులను బయటికి పంపి బాలికను వెతకమన్నాడు.
బాలిక స్కూలు రెండవ అంతస్తుమీదకు ఎక్కి కిందకు దూకింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికి లాభం లేకపోయింది. బాలిక శవాన్ని తీసుకోవటానికి తల్లిదండ్రులు నిరాకరించారు. బాలికకు న్యాయం చేయాలంటూ నమక్కల్ హైవేపై ధర్నా చేపట్టారు. అధికారులు అక్కడికి చేరుకుని సర్థిచెప్పటంతో ఆదివారం బాలిక శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నిత్యం నరకం.. మాట్లాడదామని పిలిచి మచ్చు కత్తితో 23 సార్లు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.