చిత్ర పరిశ్రమలో ఉన్న నటీ, నటులపై అందరి కళ్లూ ఉంటాయి. దాంతో వారు ఏ చిన్న తప్పు పని చేసినా వారి స్థాయి దిగజారుతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వచ్చిన పేరు ప్రతిష్టలు ఒక్క చెడు ఆరోపణ రావడంతో ముక్కలు అవుతాయి. ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నాడు..ఓ హాలీవుడ్ ప్రసిద్ద గాయకుడు. అతడు ఎవరు? ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రికీ మార్టిన్.. తెలుగు ప్రజలకు ఈ పేరు పెద్దగా పరిచయం ఉండక పోవచ్చు కానీ .. హాలీవుడ్ లో మాత్రం తెలియని వారు ఉండరు. రికీ మార్టిన్ సింగర్, పాటల రచయిత, నటుడు ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశాడు. తన కెరీర్ లో 200కు పైగా అవార్డులు అందుకున్నాడు. అనేక సినిమాల్లో సైతం నటించాడు. తాజాగా ఇతని మీద లైంగిక ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ ఆరోపణలు చేసింది మరెవరో కాదు. స్వయానా రికీ మార్టిన్ మేనల్లుడే.
రికీ మార్టిన్ తన 21ఏళ్ల మేనల్లుడిపైన లైంగిక, గృహ హింసకు పాల్పడిట్టు ఆయనపై కేసు నమోదైంది. ఈ వార్త బయటికి రావడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్యూర్టోరికోలో మార్టిన్ పై నిషేధం విధించారు.. రికీ మార్టిన్ 21 ఏళ్ల మేనల్లుడు ఎరిక్ మార్టిన్ ను బాధితుడిగా గుర్తించినట్లు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ TMZ నివేదించింది.
ఇక తనపై వస్తున్న ఆరోపణలపై రికీ మార్టిన్ తన లాయర్ ద్వారా ఇలా స్పందించారు.. “రికీ మార్టిన్.. తన మేనల్లుడితో లైంగిక లేదా శృంగార దాడి చేశాడన్నది అసత్యం. ఈ ఆరోపణ అబద్దం మాత్రమే కాదు.. అసహ్యకరమైంది కూడా. రికీ మేనల్లుడు తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే ఈ ఆరోపణలు చేశాడు. అతనికి మంచి వైద్య చికిత్స అందుతుందని ఆశిస్తున్నాం. అయితే అన్నింటికంటే మించి.. న్యాయస్థానం వాస్తవాలను పరిశీలించిన వెంటనే ఈ కేసును కొట్టివేయాలని మేము కోరుతున్నాం. ” అని తెలిపారు. జూలై21న మార్టిన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అదే రోజు తీర్పును కూడా వెళ్లడించే అవకాశం ఉంది. దీంతో ఈ ఆరోపణలే నిజం అయితే రికీ మార్టిన్ కు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరి ఈ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.