రోజుకు సగటున 90 అత్యాచారా కేసులు నమోదు!!
అది కూడా నిర్భయ ఘటన తరువాత కేసులు నమోదు .
నిందితులలో చాలా తక్కువమందికి శిక్షలు …
మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మహిళలకు కనీస రక్షణ ఉండడంలేదు. దీంతో మహిళల జీవితం కాస్త ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఆడ పిల్లలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు కామాంధులు. కొంతమంది మృగాలుగా మారిపోయి కామంతో కళ్లుమూసుకుపోయిన పాశవికంగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. 80 ఏళ్ల వృద్ధురాలి పై అత్యాచారం చేసిన ఘటన స్థానిక బుదైన్ ప్రాంతంలో జరిగింది. బాధిత వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
బాధిత వృద్ధురాలికి సమీప బంధువైన నిందితుడు డిన్నర్ సాకుతో ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమె అక్కడకు చేరుకునే సమయానికే నిందితుడు ఫూటుగా మందుకొట్టి నిషాలో ఉన్నాడు. ఈ క్రమంలోనే వృద్ధురాలిపై ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ దారుణం తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. అయితే విషయం తెలుసుకున్న ఇతర బంధువులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే వృద్ధురాలు చెబుతున్న మాటలను మొదట పోలీసులకు నమ్మశక్యంగా అనిపించలేదు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే వృద్ధురాలు ఆరోపణలు చేస్తున్నారేమో అని భావించారు. కానీ ప్రాథమిక దర్యాప్తు అనంతరం బలాత్కారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కూడా తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.