విధి ఆడిన వింత నాటకం. పాపం.. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
వారిదో అందమైన కుటుంబం. రోజూ గ్రామంలో కూలీ నాలి పనులు చేసుకుంటూ సంసారాన్ని ఈడ్చుకొస్తున్నారు. తమ పిల్లలకు మాలాంటి కష్టాలు రాకూడదని ఆ తల్లిదండ్రులు బాగా చదివిస్తున్నారు. కూతురుని స్థానికంగా ఉన్న మంచి కాలేజీలో చదివిస్తున్నారు. అయితే ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులు తమ కూతురుని చూడాలని అనుకున్నారు. దీంతో ఆదివారం ఉదయం ఈ దంపతులు బైక్ పై బయలు దేరారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో పాపం.. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు విడిచింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
అది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రాంతం. ఇక్కడే వెంకన్న, లక్ష్మీరేఖ (32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కూతురు నల్లగొండ పట్టణంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అయితే ఆదివారం సెలవు కావడంతో ఈ దంపతులు కూతురుని చూసేందుకు వెళ్లాలనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం ఈ భార్యాభర్తలు మిర్యాలగూడ నుంచి బైక్ పై బయలు దేరారు. అయితే కుక్కడం వద్దకు వీరి వాహనాన్ని వెనకాల నుంచి లారీ బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో భార్య భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోగా.. భర్తకు తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మీరేఖ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. తీవ్రంగా గాయపడ్డ వెంకన్నను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భర్త కళ్లుటే భార్య మరణించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. ఇక విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.