ములుగు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సొంత చిన్నాన్న కూతురిపైనే ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు.
అయితే ఇతనికి సొంత చిన్నాన్నకు ఓ మైనర్ కూతురు ఉంది. వరసకు చెల్లెలు అయ్యే ఆ బాలికపై ఆ యువకుడు ఎప్పటి నుంచో ఓ కన్నేసి ఉంచాడు. ఇక ఒంటరిగా ఉన్న ఆ మైనర్ బాలికపై ఆ దుర్మార్గుడు అనేక సార్లు లైంగిక దాడికి కూాడా పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరింపులకు గురి చేశాడు.
ఇది కూడా చదవండి: Chennai: పక్కింటి కుర్రాడితో ఇంట్లో భార్య.. తట్టుకోలేని భర్త ఊహించని దారుణం!
దీంతో భయంతో ఊగిపోయిన ఆ మైనర్ బాలిక ఈ దారుణాన్ని ఎవరికీ కూడా చెప్పలేదు. అలా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ బాలికపై ఆ యువకుడు అనేక సార్లు లైంగిక దాడికి యత్నించాడు. కాగా ఇటీవల ఆ బాలికకు కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పరీక్షలు జరిపిన వైద్యులు అనంతరం బాలిక గర్భవతి అంటూ నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం విన్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఎట్టకేలకు ఆ బాలిక ఆ దుర్మార్గుడు చేసిన దారుణాన్ని వివరించడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.