దొంగతనం చేద్దామనే ఆలోచనకే సగం భయపడతారు. కానీ.. నాకు అలాంటిదేమి అనిపించదు అంటున్నాడు మన కథలో ఓ దొంగ. పేరు రాజు. పోలీసులు ఎంతో కాలంగా వెతుకుతున్న గజదొంగ ఇతగాడు. పోనీ ఎక్కడ దాక్కుంటాడో అనుకుంటే పొరపాటే. ఉండేది ఫుట్ పాత్ పైనే. కానీ సొంతూర్లో మాత్రం అతడు సంపన్నుడు. స్వగ్రామంలో మూడంతస్తుల మేడ కట్టాడట. ఇక, విచారణలో రాజు వర్కింగ్ స్టయిల్ విని పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు.
తాజాగా, రాచకొండ పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. పేరు ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు. అతడి నుంచి రూ.1.30 కోట్ల విలువ చేసే బంగారు నగలు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నుంచి చోరీలకు పాల్పడుతున్న రాజు ఆ నగలను ఎక్కడా అమ్మకుండా తనవద్దే ఉంచుకున్నాడు. రాజు. ఎలా పడితే అలా దొంగతనానికి వెళ్లడు. అన్ని పథకం ప్రకారమే.
ఇది కూడా చదవండి: విచిత్ర దొంగ.. 20 రూపాయలు కోసం 3 షాపుల్లో దొంగతనం..!
అతడికి వచ్చే కలల ఆధారంగానే చోరీలకు పాల్పడతాడు. తాను ఎక్కడ దొంగతనం చేయాలో.. ఆ ఇల్లు తనకు కలలో వస్తుందని, అలా కలలో కనిపించిన ఇంట్లోనే పనితనం ప్రదర్శిస్తానని పోలీసులకు తెలిపాడు. అంతేకాదు, దొంగతనానికి వెళ్లాలో, వద్దో అనే విషయాన్ని చిట్టీల ద్వారా తేల్చేస్తాడు. రెండు చిట్టీలను వేసి ఒకదాన్ని తీస్తాడు. అందులో ఏం రాసి ఉంటే దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటాడు. మరి ఈ దొంగ పనితనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: లవర్ తో భార్య సీక్రెట్ ఛాటింగ్.. అసలు విషయం భర్తకు తెలియడంతో ఊహించని సీన్!