అమ్మాయిల అందాన్ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్ లో ఊహించలేని దారుణాలు జరుగుతున్నాయి. ఫేక్ మ్యాట్రీమోని, వ్యభిచారం వంటి వాటితో కొందరు కేటుగాళ్లు కాసుల కోసం గలీజ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా నగరంలో ఫేక్ మ్యాట్రీమోని పేరుతో సైబర్ నేరగాళ్లు ఎంతో మంది అమాయకపు యువకులను మోసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది మరువకు ముందే హైదరాబాద్ లో తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇదే ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. .
కర్ఱాటక రాష్ట్రం బవవకల్యాణ్ పరిధిలోని రాజేశ్వర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుసేన్ (35) అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేసేవాడు. ఇతనికి కలబురిగి ప్రాంతానికి చెందిన వ్యభిచారం నిర్వహించే గులాం అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే హుసేన్ రాను రాను గులాంకు ప్రధాన అనుచరుడిగా మారిపోయిడు. ఇదిలా ఉంటే సయ్యద్ హుసేన్ గత కొన్నిరోజుల కిందట హైదరాబాద్ కు చేరుకున్నాడు. నగరంలోని పాతబస్తికి చేరుకుని ఇక్కడే నివాసం ఉండే తన బంధువుల సాయంతో ఓ రూమ్ ను అద్దెుకు తీసుకున్నాడు. అలా కొంత కాలం తర్వాత ఫేక్ బాబాగా అవతారమెత్తాడు. ఎలాంటి రోగం, సమస్యలు అయినా నా వద్దకు వస్తే బాగు చేస్తానని మహిళలలను జనాలందరినీ నమ్మించాడు.
ముఖ్యంగా అమ్మాయిలను, మహిళలను తన మాయమాటలతో తనవైపుకు తిప్పుకునేవాడు. అలా ఎంతో మంది అమ్మాయిలను తన రూమ్ లోకి రప్పించుకుని వారిని నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీసేవాడు. అలా తీసిన వీడియోలతో తన గురువు అయిన గులాంకు పంపేవాడు. ఆ వీడియోలు చూసిన గులాం.. అమ్మాయిల ఫిజిక్ ను బట్టి రేటును ఫిక్స్ చేసి వారిని వ్యభిచారంలో పంపిచేవారు. ఇదే చీకటి వ్యవహారాన్ని సయ్యద్ హుసేన్ గత కొంత కాలంగా సాగిస్తున్నాడు. ఎంతో మంది అందమైన అమ్మాయిలను వీడియోలు, ఫొటోలు తీసుకుని దారుణాలకు పాల్పడ్డాడు.
అయితే ఈ దారుణ వ్యవహారంపై స్థానింగా ఉండే ఓ సామజిక కార్యకర్త స్పందించింది. గుట్టుగా సాగిస్తున్న ఈ చీకటి దందాను గుట్టు రట్టు చేయాలనుకుంది. వెంటనే అడుగులు వేసిన ఆ మహిళ.. ఫేక్ బాబాగా ఉంటూ ఎంతో మంది అమ్మాయిలు, మహిళలతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి ఫేక్ బాబా సయ్యద్ హుసేన్ అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆలస్యంగా హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.