hyderabad : కామాంధులు విచక్షణ కోల్పోతున్నారు. వావివరసలు మరిచి వికృతాలకు పాల్పడుతున్నారు. ఓ తండ్రి కంటి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపై కన్నేశాడు. చిన్న పాప అని కూడా చూడకుండా అత్యచారం చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబ్‌నగర్‌కు చెందిన రమేశ్‌కు సరోజతో 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే, పాప పుట్టిన కొన్ని రోజులకే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డ రమేష్ మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య, ఆమె కుమారుడు, మొదటి భార్య కూతురితో కలిసి బోయిన్‌పల్లిలో ఉంటున్నారు. కామంతో కన్ను మిన్నూ కానని రమేష్ బుధవారం రాత్రి కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. సవతి తల్లి పాపను భర్తనుంచి రక్షించింది. ఇకనైనా బుద్ధిగా ఉండాలని హెచ్చరించింది. అయితే, అతడిలో మార్పు రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : లాడ్జికి పిలిచి భార్య కాలు నరికిన భర్త.. కారణం ఏంటంటే?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.