Konaseema District: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ‘కోనసీమ’ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘కోనసీమ’జిల్లా పేరు మార్పుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. మంగళవారం కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో వందల మంది యువకులు పాల్గొన్నారు. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ యువకులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్ దగ్గరకు బయలుదేరారు.
వీరి రాకను అడ్డుకుంటూ కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో పోలీసులు వాహనాలను అడ్డంగా ఉంచారు. నిరసన చేపడుతున్న కొంతమంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి తప్పించుకోవటానికి కొంతమంది యువకులు పరుగులు తీయసాగారు. దీంతో పోలీసులకు, యువకులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం కొంతమంది యువకులు కలెక్టరేట్ వైపు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే అమలాపురం ఆస్పత్రి దగ్గర ఉన్న పోలీస్ జీపుపై ఓ యువకుడు రాయి విసిరాడు. అనంతరం పోలీసులపై రాళ్ల దాడి జరిగింది.
ఆందోళన కారుల్ని తరలిస్తున్న బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళన తీవ్ర తరం అవ్వటంతో నిరసనకారులు ఓ బస్సుకు నిప్పుపెట్టారు. ఓ జీపును కూడా ధ్వంస చేశారు. పోలీసులు ఆందోళన కారుల్ని చెదరగొట్టి, పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కాగా, కోనసీమ జిల్లాలో సోమవారం నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికోన, రావులపాలెం మండలాల్లో ఆంక్షలు ఉండనున్నాయి.
Huge unrest in Amalapuram of #AndhraPradesh .
Newly created district was named as #Konaseema a month back,it was renamed as #Ambedhkar a week ago by @ysjagan ‘s govt.
Now,OBC groups are protesting to restore the name ‘Konaseema’
144 prohibitory orders on.
Stone pelting on. pic.twitter.com/2geJJRfatT
— Sanjeevee sadagopan (@sanjusadagopan) May 24, 2022
Anything for Konaseema #Konaseema 🔥 pic.twitter.com/yuSTg5Qvbk
— VINNU DHFM (@VinodhSSMB) May 24, 2022
#BreakingNews: Agitation opposing renaming #Konaseema district after BR Ambedkar in #Amalapuram town of #AndhraPradesh on #Tuesday turned violent with protestors setting ablaze couple of buses and resorting to stone pelting on #police @NewIndianXpress @Kalyan_TNIE pic.twitter.com/2cqP34bwn3
— TNIE Andhra Pradesh (@xpressandhra) May 24, 2022
144 సెక్షన్ బేఖాతరు, వేలాదిమంది కోనసీమ పరిరక్షణ సమితి యువకులు అమలాపురం చేరిక.
కలక్టరేట్ ముట్టడికి సిద్ధం అయిన కోనసీమ జిల్లా మద్దతు దారులు.
పోలీసుల బందోబస్తు విఫలం, ఒక్కసారిగా జరిగిన ఘటనకు అయోమయంలో పోలీసులు.
జై కోనసీమ నినాదాలతో మారుమ్రోగుతున్న అమలాపురం పట్టణం.#konaseema pic.twitter.com/MhDs0Igd00
— Mahaa News (@MahaaOfficial) May 24, 2022
ఇవి కూడా చదవండి : MLC Driver Case: ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ట్విస్టు.. సీసీటీవీ ఫుటేజీలో అసలు విషయం..