అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమంది యువకుల ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిత్యం మనం రోడ్డు ప్రమాదాలు ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం. కొందరు మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల, అతివేగంతో వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక యువకుల విషయానికి వస్తే.. నిత్యం మద్యం సేవించి, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువకులు చెడు స్నేహంతో వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడే తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు.
అయితే, అతివేగంతో జరిగిన అనేక రోడ్డు ప్రమాదాల్లో చూసుకుంటే చాలామంది యువకులే ప్రాణాలను కోల్పోతున్నారు. ఒకవేళ ప్రమాదం తర్వాత బతికినా అవయవాలు కోల్పోవడం జరుగుతుంది. ఇలా ఎన్నో నిత్యం జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, అచ్చం ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాద ఘటన తాజాగా అసోంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అసోం గువాహాటిలోని జలుకబారి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ప్రాణాలను కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి 1 గంటలకు ఈ ఘటన జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అసోంలోని ఓ ప్రముఖ కాలేజీ ఇంజినీరింగ్ విద్యార్థులు 10మంది కలిసి స్కార్పియో కారులో ప్రయాణిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి 1 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి పక్కనే ఉన్న బొలెరోను వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న పదిమందిలో ఏడుగురు స్టూడెంట్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయాలైన వారిలో ముగ్గురి పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని తెలిపారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.
పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగించారు. పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే ముఖ్య కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, మృతులు అరింధమ్ భోవల్, నియార్ దేకా, కౌశిక్ మోహన్, ఉపాంగ్ష్ శర్మ, రాజ్ కిరణ్ భూయానంద్, రాజ్ కిరణ్ హువనీబంద్, కౌశిక్ బారువా గా పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.