నేటి కాలంలో పెళ్లైన కొందరు మహిళలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుని సీక్రెట్ రొమాన్స్ కు అలవాటుపడుతున్నారు. భర్తను కాదని ప్రియుడి ముసుగులో పడి చివరికి చావటానికైన, చంపటానికైన సిద్దమే అన్నట్లుగా తయారవుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో అత్త ప్రియుడిని అల్లుడు దారుణంగా చంపిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని కొరత్తూరులోని కామరాజు రోడ్డులో సెల్వరాజ్, రాణి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది.
ఈ జంట పెళ్లైన నాటి నుంచి ఎంతో సంతోషంగా జీవించారు. భర్త సెల్వరాజ్ కి గోపి అతనే కార్ల వ్యాపారం చేసే స్నేహితుడు ఉండేవాడు. అయితే గోపి అప్పుడప్పుడు తన ఫ్రెండ్ అయిన సెల్వరాజ్ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సెల్వారాజ్ భార్య రాణిపై కాస్త కన్నేశాడు. ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటూ పరిచయం కూడా పెంచుకున్నారు. రాను రాను వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక భర్త లేని సమయంలో వీరిద్దరూ ఎంచక్కా చీకటి రొమాన్స్ కు తెరలేపేవారు.అయితే కొన్నాళ్లకి రాణి భర్త సెల్వరాజ్ అనారోగ్య కారణాలతో మరణించాడు. ఇక భర్త లేకపోవడంతో రాణి ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసేది. అలా చాలా కాలం నుంచి సాగుతున్న వీరి వివాహేతర సంబంధం ఎట్టకేలకు రాణి మేనల్లుడికి తెలియడంతో అత్తకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న విళ్లీద్దరూ మళ్లీ రంకుపురాణానికి తెర లేపారు. ఓ రోజు రాణి ప్రియుడి గోపితో బెడ్ రూంలోకి దూరిపోయింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ విషయం తెలుసుకున్న అల్లుడు హుటాహుటిన కత్తితో వాళ్లున్న బెడ్ రూంలోకి పరిగెత్తి అత్త ప్రియుడైన గోపి ముఖంపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఇక నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అప్పట్లో జరిగిన ఈ ఘటన ఈ ఏడాదిలో సంచలనంగా మారింది. ప్రియుడితో బరితెగించి ప్రవర్తించిన అత్త రాణి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.