హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల ముఠా మరోసారి రెచ్చిపోయారు. రోడ్డుపూ ఒంటరిగా కనిపించిన మహిళలపై దాడులు చేస్తూ తాళిబొట్లు విలువైన అభరణాలు తీసుకెళ్తున్నారు. ఇలాంటి చైన్ స్నాచింగ్ ఘటనలు గతంలో ఏపీ తెలంగాణలో భారీగా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల ముఠా మరోసారి రెచ్చిపోవడం సంచలనంగా మారుతోంది. అయితే నగరంలోని గంటల వ్యవధిలోనే ఉప్పల్, ఓయూ, నాచారం, రామ్ గోపాల్ పేట వంటి ప్రాంతాల్లో 6 చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్ పాల్పడి విలువైన అభరణాలు ఎత్తుకెళ్లిపోయారు.
ఈ ఘటనలపై వెంటనే స్పందించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే నగరంలో చైన్ స్నాచర్లు మారోసారి రెచ్చిపోవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ప్రజలంతా రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని, మీకు రోడ్లలపై ఎవరూ అనుమానంగా కనిపించిన వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్ల ముఠా దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.