అంజలి సింగ్ రోడ్డు ప్రమాద ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఆ యువతిని కారు దాదాపుగా 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులకే కాకుండా పోలీసులకు సైతం అనుమానాలు కలిగాయి. ఎవరో కావాలని అంజలిని అత్యాచారం చేసి, ఆపై కారుతో ఆక్సిడెంట్ చేసి చంపేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన అంజలి సింగ్ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా విడుదలైంది. అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఏం తేలింది? నిజంగానే ఆ యువతిపై అత్యాచారం జరిగిందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్ పూర్ ప్రాంతం. కొత్త సంవత్సరం తెల్లవారు జామున అంజలి సింగ్ అనే యువతితో పాటు మరో యువతి కలిసి స్కూటీపై వెళ్తున్నారు. ఇక సుల్తాన్ పూర్ ఏరియాకు రాగానే కొందరు యువకులు ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద అంజలి కారు ఇరుక్కుపోయింది. దీంతో ఆమె వెనకాల ఉన్న మరో యువతి అక్కడి పడిపోగా అంజలిని మాత్రం అదే కారు దాదాపుగా 13 కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లగా ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇక రోడ్డుపై ఆ యువతి శవం నగ్నంగా కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అంజలి మృతదేహాన్ని పరిశలించారు. అనంతరం ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించారు.
అందులో ఆ యువతిని కారు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. ఇక ఆ కారులో ప్రయాణించిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఆ యువతిని అత్యాచారం చేసి చంపేశారా? లేక రోడ్డు ప్రమాదమా అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భాగంగా తాజాగా వైద్యులు విడుదల చేసిన ఆ యువతి పోస్ట్ మార్టం రిపోర్టును సైతం పరిశీలించారు. కానీ ఆ రిపోర్ట్ లో.. యువతి ప్రైవేట్ పార్ట్ లకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆమెపై అసలు అత్యాచారమే జరగలేదని రిపోర్ట్ లో తేలింది. ఇదిలా ఉంటే మరిన్ని టెస్టుల కోసం పోలీసులు శ్వాబ్ శాంపిల్స్ తో పాటు ఆమె జీన్స్ ప్యాంట్ ముక్కలను సైతం పోలీసులు భద్రపరిచారు. తాజాగా విడుదలైన ఆ యువతి పోస్ట్ మార్టం రిపోర్ట్ తో అనేక అనుమానాలకు చెక్ పెట్టినట్లు అయింది. ఇదే ఘటన గత రెండు రోజుల నుంచి తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే.