డ్రగ్స్‌పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిసిన కూడా కొందరు యదేచ్ఛగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన విచారణలో డ్రగ్స్ విషయం వెలుగులోకి రావడంతో ఎన్సీబీ బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది నటీనటులని విచారించిన విషయం తెలిసిందే. టాలీవుడ్,శాండల్వుడ్లోను డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఇప్పుడు రీసెంట్ గాబుర్రకథ’ ఫేమ్ నైరాషా డ్రగ్స్ కేసులో అరెస్టయింది. ఆమెను ఎన్.సి.బి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు.
నైరా జన్మదినం సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హస్సేన్‌తో కలిసి జుహులోని ఒక హోటల్ గదిలో పార్టీ చేసుకుంది. సదరు హోటల్లో డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో అదేరోజు తెల్లవారుజామున 3గంటలకు ఎన్.సి.బి అక్కడ తనిఖీలు చేసింది. ఈక్రమంలోనే నైరాతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ సిగరెట్లలో గంజాయి పీలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.
పక్కా ఆధారాలతో నైరా ,ఆషిక్ సాజిద్ హస్సేన్ ఇద్దరూ నిషేధిత మాదకద్రవ్యాలు సేవించినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్,సారా అలీ ఖాన్,దీపికా పదుకొణే,శ్రద్ధా కపూర్ వంటి టాప్ హీరోయిన్స్ కూడా డ్రగ్స్ సేవించారని ఆరోపణలు రావడంతో ఎన్సీబీ వీరిపై ప్రత్యేక విచారణ జరిగిన సంగతి తెలిసిందే.
