బంగారం ధరలు తగ్గనున్నాయా? రూ. 60 వేలు ఉన్న స్వచ్ఛమైన బంగారం రూ. 50 వేలకు పడిపోనుందా?
జూన్ 18 నుంచి ఆషాఢ మాసం సీజన్ మొదలవుతుంది. పెళ్లిళ్ల సీజన్ కాకపోవడంతో బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా కూడా పలు కారణాల వల్ల బంగారం ధరలు భారీగా దిగొస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 50 వేల దిగువకు పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మే నెలలో అమెరికాలో ఔన్సు బంగారం గరిష్టంగా 2050 డాలర్లు మార్కుని తాకింది. 2050 డాలర్ల నుంచి క్రమంగా పడిపోతూ వచ్చింది. జూన్ నెల వచ్చేసరికి భారీగా పతనమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1958 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఏకంగా 92 డాలర్లు మేర వ్యత్యాసం కనబడుతుంది. ఇదే గోల్డ్ గత నెలలో 1932 డాలర్లకు పడిపోయింది. అంటే గత నెలలో 118 డాలర్ల మేర పతనమైంది.
106 డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 9,721.37. మే 5న గరిష్టంగా బంగారం 2050 డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 1,68,971.97 పలికింది. ప్రస్తుతం 1958 డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 1,61,348.60గా ఉంది. అంటే రూ. 7,623 తగ్గింది. మే 5న గరిష్టంగా ఉన్న బంగారం మే 30న భారీగా పతనమైంది. మే 30న 1932 డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 1,59,185.98కి పడిపోయింది. మే నెలలో పలికిన గరిష్ట ధరకు, కనిష్ట ధరకు మధ్య వ్యత్యాసం రూ. 9,785.99. రూ. 214 తక్కువ రూ. 10 వేలు తగ్గింది. ప్రస్తుతం (జూన్ 13న) హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,450 వద్ద కొనసాగుతోంది. మే నెలలో గరిష్టంగా రూ. 62,400 ఉంది. కనిష్టంగా రూ. 60,490 ఉంది.
జూన్ నెలలో ఈ 12 రోజుల్లో గరిష్టంగా రూ. 61,100 ఉండగా.. కనిష్టంగా జూన్ 8న రూ. 60,220 వద్ద నమోదైంది. అయితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఆషాఢ మాసం కారణంగా బంగారంపై డిమాండ్ తగ్గి ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 24 క్యారెట్ల బంగారం రూ. 60 వేలకు పడిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు అమెరికా ప్రభుత్వం రుణ సంక్షోభం నుంచి గట్టెక్కడంతో బాండ్ ఈల్డ్స్ కి డిమాండ్ పెరిగి అమెరికన్ బాండ్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. న్యూయార్క్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్ ఫ్యూచర్ పై అంచనాలు తగ్గుతున్నాయి.
ఈ క్రమంలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే రూ. 60 వేల పైన ఉన్న బంగారం రూ. 50 వేలకు పడిపోయే అవకాశం ఉందా అంటే ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ధర భారీగా పెరిగి కొన్ని రోజుల తర్వాత భారీగా తగ్గుతుందే తప్ప ఇప్పుడున్న ధర భారీగా అయితే తగ్గదని అంటున్నారు. 2022 నవంబర్ 4న 24 క్యారెట్ల బంగారం కనిష్ట ధర రూ. 50,290గా ఉంది.7 నెలలు గడిచింది. బంగారం కూడా రూ. 10 వేలు పైనే పెరిగింది. రూ. 10 వేలు వ్యత్యాసం అయితే కనబడే అవకాశం ఉండదని.. రూ. 50 వేలకు పడిపోయే అవకాశం ప్రస్తుతం లేదని అంటున్నారు. అయితే ఏడాది చివరిలో తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఆషాఢ మాసం కాబట్టి దేశీయంగా ధరలు తగ్గుతాయని అంటున్నారు.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి సాధారణం. కాబట్టి కొనే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.