Uber: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఊబర్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో రద్దు చేసిన రైడ్ షేరింగ్ సర్వీస్‌ను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ సదుపాయాన్ని కొత్త పేరుతో అందుబాటులోకి తెస్తోంది. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు ‘ఊబర్ పూల్’ పేరిట ఈ సర్వీస్ అందుబాటులో ఉండింది. ఇప్పుడు ‘ఊబర్ ఎక్స్ షేర్’ పేరటి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఎంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కోతో పాటు మరికొన్ని నగరాల్లో అందుబాటులో ఉంది. అతి త్వరలో మిగిలిన దేశాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ‘ఊబర్ ఎక్స్ షేర్’.. ‘ఊబర్ పూల్’ మాదిరిగానే ఉంటుంది.
అయితే, ‘ఊబర్ ఎక్స్ షేర్’లో క్యాస్ ఇన్‌సెన్‌టివ్స్ సదుపాయం ఉంది. ‘ఊబర్ ఎక్స్ షేర్’ను ఎంచుకున్న కస్టమర్లు.. వారు వెళ్లే రూటులోని మరికొంతమంది రైడర్లతో కలిపి ప్రయాణించాల్ని ఉంటుంది. రోడ్డుపై ఎక్స్‌ట్రా సమయం వేచిఉన్నా.. మనకు ఏదైనా అసౌకర్యం కలిగినా ఊబర్ మొత్తం ఛార్జీలో 20 శాతం డిస్కౌంట్ రూపంలో మనకు అందిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ‘ఊబర్ ఎక్స్ షేర్’ ఛార్జీలు ఊబర్ ఎక్స్ రైడ్ కంటే చాలా తక్కువ ఉంటాయని వారు తెలిపారు. మరి, త్వరలో అందుబాటులోకి రానున్న ‘ఊబర్ ఎక్స్ షేర్’ సదుపాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nothing phone(1): నథింగ్ ఫోన్ 1.. అబ్బురపరిచే ఫీచర్లు ఇవే!