టీవలే కాలంలో బంగారం ధర ఆకాశం వైపు పరుగులు తీస్తుంది. అయితే తాజాగా పసిడి ప్రియులకు ఓ మంచి ఛాన్స్ వచ్చింది. బంగారం ధరలు వరుసగా దిగివచ్చి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈ రోజుల్లో భూమి తర్వాత అంత డిమాండ్ ఉన్నది ఏమన్నా ఉందంటే అది బంగారమే. బంగారం, వెండి, వజ్రాల వండి వాటిని ఇష్టపడని మహిళలు ఉండరు. ఇప్పుడు పురుషులు కూడా వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. అందుకే వీటి ధరలు తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవలే కాలంలో బంగారం ధర ఆకాశం వైపు పరుగులు తీస్తుంది. అయితే తాజాగా పసిడి ప్రియులకు ఓ మంచి ఛాన్స్ వచ్చింది. బంగారం ధరలు వరుసగా దిగివచ్చి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈ వారం రోజుల్లో ఏకంగా రూ.700 పైన పడిపోయింది. నేడు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న క్రమంలో బంగారం ధరలు 90 రోజుల కనిష్టానికి దిగి రావడం అందరికి ఊరట కలిగిస్తోంది. బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశంగా మార్కెట్ నిపుణులు అంటున్నారు. కొన్ని రోజుల తరువాత మళ్లీ పెరిగే సూచనలు ఉన్నాయని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వేడి ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడం దేశీయ మార్కెట్లో కూడా ఎలాంటి ప్రభావం చూపులేకపోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వంటి నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొన్ని రోజులుగా దిగి వస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1,945.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ వెండి రేటు ఒక ఔన్సుకు 23.25 డాలర్ల మార్క్ వద్ద కొనసాగుతోంది. భారతీయ కరెన్సీ రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ రూ.82.609 వద్ద కొనసాగుతోంది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధరలోఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు రూ.55,550 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రేటులో కూడా ఎలాంటి మార్పు లేకుండా తులానికి రూ.60,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం, వెండి ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.