. గతంతో పోలిస్తే వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. అలాగే గోల్డ్ వస్తువులు కొనేందుకు రాజీ పడటం లేదు. ప్రస్తుతం ఏక మొత్తంలో కొనుగోలు చేయలేకపోయిన.. ప్రస్తుతం ప్రతి నగల దుకాణం స్కీమ్ పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
బంగారం, వెండి వంటి ఆభరణాలకు భారత్‌లో ఎప్పుడూ డిమాండే. ఫంక్షన్ ఏదైనా.. చేతితో పెద్ద మొత్తంలో డబ్బు ఉందంటే ముందు చూసేది బంగారం దుకాణాల వైపే. చిన్న వస్తువైనా తీసుకోవాలనుకుంటున్నారు. బంగారం ధర కొండనెక్కడంతో పాటు వెండి కూడా జ్యుయల్లరీ రూపంలో రావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆడవాళ్లు. గతంతో పోలిస్తే వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. అలాగే గోల్డ్ వస్తువులు కొనేందుకు రాజీ పడటం లేదు. ప్రస్తుతం ఏక మొత్తంలో కొనుగోలు చేయలేకపోయిన.. ప్రస్తుతం ప్రతి నగల దుకాణం స్కీమ్ పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మార్కెట్ ధరను బట్టి ఏ రోజుకారోజు పసిడిని లాక్ చేసుకునే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు పెట్టుబడులు ఎలాగూ ఉండనున్నాయి. అత్యవసర పరిస్థిల్లోనూ ఆదుకుంటుందీ కాబట్టి బంగారం, వెండి ధరలపై మక్కువ ఎక్కువ భారతీయులకు.
ఇక గత కొన్ని రోజుల నుండి తగ్గిన పుత్తడి ధర.. క్రితం సెషన్‌లో మాత్రం పెరిగింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర నేల చూపులు చూడటం గమనార్హం. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1947.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. స్పాట్ సిల్వర్ రేటు స్తబ్దుగా కొనసాగుతోంది. ప్రస్తుతం స్పాట్ వెండి రేటు ఔన్సుకు 23.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియన్ కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.82.428 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీ, హైదరబాద్ వంటి మహా నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని హస్తీనాలో 24 క్యారెట్ల మేలిమి తులం బంగారం ధర రూ. 320 మేర పెరిగింది. ఇది పెరిగి రూ. 61,320 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 300 పెరిగి రూ. 56, 100 పలుకుతోంది. బంగారం ధర తగ్గుతున్నా.. వెండి మాత్రం దిగిరానంటోంది. వీటి ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధానిలో కిలో వెండి ధర రూ. 600 మేర పెరిగింది. ప్రస్తతం కిలో సిల్వర్ రేటు రూ.73,400గా కొనసాగుతుంది.
ఇక హైదరాబాద్ మహా నగరంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే…24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.340 పెరిగింది. రూ. 10 గ్రాముల బంగారం ధర రూ. 61, 250గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 300 పెరిగింది. రూ. 56వేల వద్ద కొనసాగుతుంది. అయితే రెండు నెలల కనిష్ట స్థాయి వద్ద ధరలు కొనసాగడం గమనార్హం. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.1000 పెరిగింది. ఇప్పుడు కిలో రేటు రూ.78, 600 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఆయన నగరాల్లో కూడా ధరల్లో మార్పులు ఉంటాయి. స్థానిక పన్నులు, కమీషన్ వంటివి ఉంటాయి.