దేశంలో కల్తీ మాఫియా బాగా విస్తరించింది. పప్పులు, ఉప్పు దగ్గర నుంచి.. పసిపిల్లలు తాగే పాల వరకు ప్రతి ఒక్కటి కల్తీనే. వాస్తవానికి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రతి ముగ్గురిలో ఇద్దరు భారతీయులు రసాయనాలు కలిపిన కల్తీ పాలను తాగుతున్నారు. ఈ నివేదిక చూసి చలించిపోయిన యువతి, స్వచ్ఛమైన పాలను అందించాలానే సంకల్పంతో.. చేతిలో ఉన్న11,000 లతోనే ఓ స్టార్టప్‌ని ప్రారంభించి.. ఇప్పుడు కోట్ల రూపాలయలను ఆర్జిస్తోంది.
పేరు.. శిల్పి, సొంతూరు..జార్ఖండ్‌లోని దాల్తోన్‌గంజ్, బెంగళూరు కంటే 20 రెట్లు తక్కువ జనాభా ఉన్న పట్టణం. తనకు ఉదయాన్నే కప్పు ఆవుపాలు తాగడం అలవాటు. పై చదువుల కోసం 2012 లో బెంగళూరుకు వచ్చింది. మంచి పేరున్న హాస్టల్‌లో వసతి చూసుకుంది. పాలు తెప్పించుకుని తాగినప్పుడు ఆవి ఆమెకు మింగుడుపడలేదు.. కారణం అవి కల్తీపాలు. స్వచ్ఛమైన కప్పు పాల కోసం బెంగళూరులో చాలా ప్రయత్నాలే చేసింది శిల్పి. ఆ కోరిక నెరవేరలేదు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికలు చూసి తాను చలించి పోయింది.అప్పుడే తను బెంగళూరులోనే ఆవు పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. కొంతమంది పాడి రైతులను కలిసింది. భాష రాకపోయినప్పటికీ రైతుల వద్దకు వెళ్లిన శిల్పి ఆవుల దాణా, వాటి సంరక్షణ గురించి వివరాలు తెలుసుకుంది. బయటివారు ఇచ్చే ధర కన్నా తను కొంచెం ఎక్కువ మొత్తమే చెల్లిస్తానని చెప్పింది. రైతులు సంతోషంగా సరే అన్నారు. ఆరు సంవత్సరాల తరువాత 2018లో, అందరకి స్వచ్ఛమైన పాలును అందించాలనే లక్ష్యంతో..’ది మిల్క్ ఇండియా’ కంపెనీని స్థాపించింది.
కంపెనీ పెట్టాక పాలసేకరణకు పనివాళ్లు లేరు. పోనీ పని వారిని పెట్టుకుందామంటే.. వాళ్లకు చెల్లించడానికి తన దగ్గర అంత డబ్బూ లేదు. అందుకని, తనే తెల్లవారుజామున మూడు గంటలకు రైతులవద్దకు వెళ్లేది. ఆమె నిజాయితీ, పాలలోని స్వచ్ఛత కారణంగా ఆరునెలల్లోనే ఆమె వినియోగదారుల సంఖ్యను 500కు చేరింది. అది అంతకంతకూ పెరిగిపోతూండడంతో రెండేళ్ల కిందట జనవరిలో సంస్థకు ‘ది మిల్క్ ఇండియా’ అని పేరు పెట్టింది.ఈ కంపెనీ.. సర్జాపూర్(బెంగళూరు)కు 10 కిలోమీటర్ల పరిధిలో లీటరు పాలను 62 రూపాయలకు అందిస్తోంది. వీరు పచ్చి, పాశ్చరైజ్ చేయని స్వచ్ఛమైన ఆవు పాలను అందిస్తోంది. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా స్వచ్ఛమైన ఆవు పాలను గాజు సీసాలలో పంపిణీ చేస్తున్నారు. ఈ సంస్థ ప్రారంబ పెట్టుబడి రూ.11,000. రెండేళ్లలోనే ‘ది మిల్క్ ఇండియా’సంస్థ ప్రస్తుతం కోటిరూపాయల టర్నోవర్‌కి చేరుకుంది. శిల్పి ప్రయత్నంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.