మన జీవితం ఇంతే అనుకుని బతికేవారికి ఇతని జీవితం ఒక ఆదర్శం. ఎందుకంటే ఆఫీస్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి రెండు కంపెనీలకు సీఈఓ అయ్యే స్థాయికి ఎదిగారు.
కళ్ళు లేకపోతే వ్యక్తిగత పనులు చేసుకోవడమే కష్టం. అలాంటిది ఉద్యోగం, వ్యాపారం చేయడం అంటే ఇంకెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ లోకంలో చాలా మంది లోపాన్ని పక్కన పెట్టి సక్సెస్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిలో భూమిక ఒకరు. ఈమెకు రెండు కళ్ళు కనిపించవు. కానీ యూట్యూబ్ లో వంటల వీడియోలతో ఆమె సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి.. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం.. అప్పుడే నీ జయం నిశ్చయంరా అని సిరివెన్నెల పాటను నిజం చేశారో మహిళ. ఓడిపోకూడదని ఆమె అడ్డుపడ్డ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి లాయర్ గా, డ్రైవర్ గా, నిపుణురాలిగా, కార్మికురాలిగా అవతారాలు ఎత్తారు. ఏ అవతారం ఎత్తినా అందులో విజయమే. ఏ వ్యాపారం చేసిన విజయమే.
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. మనకి వచ్చిన పనులే మనల్ని అందనంత ఎత్తులో కూర్చోబెడతాయి. ఒక మహిళ పచ్చళ్ళు పెట్టడాన్ని వ్యాపారంగా మార్చుకుని ఇవాళ లక్షల్లో సంపాదిస్తున్నారు. వంట గదిలో ఉంటూనే పచ్చళ్ళు తయారు చేసి ఇవాళ ఆమె అతి పెద్ద పచ్చళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి యువరాణి అయ్యారామె.
10 వేల రూపాయలతో ఏం చేయచ్చు అంటే సొంత ఊర్లోనే ఉంటూ ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ వ్యాపారం బాగుంటే ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల లోన్ పొందవచ్చు. ఏటా రూ. 40 లక్షల ఆదాయం తీసుకురావచ్చు. ఇదేమైనా సినిమానా.. అనుకుంటే అయిపోవడానికి అని అనుకోకండి. ఒక సాధారణ మహిళ నాలుగేళ్ళ వ్యవధిలో సాధించిన ఘనత తాలూకు కథ ఇది.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని అనేక మంది నిరూపిస్తూ వచ్చారు. ఈ విషయంలో ఆడవాళ్లు ఏమీ తక్కువ కాదు. పెళ్ళైన ఆడవాళ్లు కూడా అద్భుత విజయాలను సాధిస్తున్నారు. పెళ్ళైతే ఇక జీవితం అయిపోయింది అని అనుకునే మహిళలు చాలా మంది ఉంటారు. కానీ ఒక్కసారి చరిత్ర చూసుకుంటే పెళ్ళై, పిల్లలు పుట్టిన పుణ్య స్త్రీలు ఎందరో అద్భుతమైన విజయాలను సాధించారు. విజయాలను సాధించడం పక్కన పెట్టండి. చావు ఎదురొస్తున్నా.. బిడ్డను […]
క్యాన్సర్ మహమ్మారి నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. కానీ అనేక మంది సెలబ్రిటీలు క్యాన్సర్ తో పోరాడి గెలిచారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే ఇలా చాలా మంది సెలబ్రిటీలు క్యాన్సర్ ని జయించారు. ఈ లిస్టులో ఒక తెలుగు హీరోయిన్ కూడా ఉంది. సుదీర్ఘ కాలం పాటు క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలతో బయట పడింది. ఒకసారి కాదు, రెండు సార్లు ఆ హీరోయిన్ ని తీసుకెళ్లిపోవాలని ప్రయత్నించింది. […]
పోలీస్ ఉద్యోగం సంపాదించాలని ఎంతోమంది కలలు కంటారు. కలకి, కళకి ఆడ, మగ తేడా ఉండదు కదా. ఆడవారు కూడా తమ కలలని నిజం చేసుకోవాలని, తమ కళని బయట ప్రపంచానికి చూపించాలని తాపత్రయపడతారు. ఈ క్రమంలో కొంతమంది అవమానిస్తారు. ఆడదానివి నీకెందుకు చదువు, నీకెందుకు ఉద్యోగం, అందులోనూ పోలీస్ ఉద్యోగం అవసరమా అని నిందిస్తుంటారు. ఆడపిల్ల పుడితే శాపం, పాపం అనుకునే ఈరోజుల్లో ఒక తండ్రి తన ఆడపిల్లల్ని మగాళ్లకేం తీసిపోని విధంగా పెంచారు. తనకి […]
చిత్రపరిశ్రమలో కొంతమంది నటులు వ్యక్తిత్వం పరంగా ప్రేక్షకులను ఎంతో ఇన్స్పైర్ చేస్తుంటారు. ఇంకొంతమంది నటన పరంగా ప్రేక్షకులను కదిలిస్తుంటారు. ఈ రెండు క్వాలిటీస్ కలిసిన నటులలో ఒకరు టాలీవుడ్ ‘రియల్ స్టార్’ శ్రీహరి. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ సైకిల్ మెకానిక్ నుండి స్టార్ హీరోగా ఎదిగిన తీరు ఆదర్శనీయం. నిరుపేద కుటుంబం నుండి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి.. టాలీవుడ్ లో ‘వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్’గా శ్రీహరి గొప్ప పేరు […]
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కొందరు అమ్మానాన్నల కంటే ఆస్తిపాస్తులే ఎక్కువనుకి బతుకుతున్నారు. తోబుట్టువుల కంటే నోట్ల కట్టలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోట్లు సంపాదించి పెట్టినా పిడికెడు అన్నం పెట్టేందుకు చేతులురాని కొడుకులు, కూతుర్లు ఎందరో. కానీ, తల్లిదండ్రులపై మమకారం, ప్రేమ ఉన్న కొడుకులు.. ఇంకా ఉన్నారని నిరూపిస్తున్న ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి పేరు దుర్గయ్య.. ప్రకాశం జిల్లాకు చెందినవాడు. గతంలో […]