దిగ్గజ కార్ల తయారీ కంపెనీ అయిన టాటా మోటార్స్ 8 కార్లను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇకపై ఈ 8 రకాల టాటా కార్లు కనిపించవన్నమాట. మరి ఆ కార్లు ఏంటో చూసేయండి.
ఎంతో చరిత్ర కలిగిన టాటా మోటార్స్ నుంచి కార్లు వస్తున్నాయంటే చాలు.. జనాలు ఎగబడి కొంటారు. కార్ల తయారీలో టాటా మోటార్స్ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ఒకప్పుడు నానో కార్లతో ప్రభంజనం సృష్టించింది. అప్పట్లో మిడిల్ క్లాస్ వారి కలల కారుని లక్ష రూపాయలకే అందించి చరిత్ర సృష్టించింది. మళ్ళీ నానో వస్తే బాగుణ్ణు అని చాలా మంది భావిస్తున్నారు. నానో ఈవీ త్వరలోనే వస్తుందని అంటున్నారు. అప్పట్లో ఏవో కారణాల వల్ల నానో కార్లను టాటా మోటార్స్ సంస్థ నిలిపివేసింది. తాజాగా 8 కార్లను టాటా మోటార్స్ నిలిపివేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టాటా కార్లలో ఫేమస్ అయిన ఒక మోడల్ వేరియంట్లను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 వేరియంట్లను నిలిపి వేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే ఈ ప్లేస్ లో మరో రెండు కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. టాటా ఆల్ట్రోజ్ మోడల్ లోని కొన్ని వేరియంట్లను నిలిపివేస్తున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. ఓ ప్రముఖ ఆటోమొబైల్ వెబ్ సైట్ నివేదికల ప్రకారం మొత్తం 8 వేరియంట్లను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్స్‌జడ్ ప్లస్ పెట్రోల్, ఎక్స్‌జడ్ ప్లస్ పెట్రోల్ డార్క్ ఎడిషన్, ఎక్స్‌జడ్ ప్లస్ ఐ-టర్బో, ఎక్స్‌జడ్ ప్లస్ ఐ-టర్బో పెట్రోల్ డార్క్ ఎడిషన్, ఎక్స్‌జడ్ఏ ప్లస్ పెట్రోల్, ఎక్స్‌జడ్ఏ ప్లస్ పెట్రోల్ డార్క్ ఎడిషన్, ఎక్స్‌జడ్ ప్లస్ డీజిల్, ఎక్స్‌జడ్ ప్లస్ డీజిల్ డార్క్ ఎడిషన్ వేరియంట్లు ఉన్నాయి. ఆల్ట్రోజ్ లో ఈ 8 వేరియంట్లను నిలిపివేసిన టాటా మోటార్స్.. రెండు కొత్త వేరియంట్లను పరిచయం చేసింది.
ఈ వేరియంట్ల ఎక్స్ షోరూం ధర రూ. 6.90 లక్షల నుంచి మొదలవుతుంది. టాటా ఆల్ట్రోజ్ బేసిక్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 6.60 లక్షలుగా ఉంది. అత్యాధునిక ఫీచర్స్ తో కొత్త వేరియంట్లు లభ్యం కానున్నాయి. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 1.2 లీటర్ రెవొట్రాన్ పెట్రోల్ ఇంజిన్ సహా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ మెంట్, అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ఆటోమోటివ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, 16 అంగుళాల స్టైలిష్ వీల్స్, కవర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆల్ట్రోజ్ ఏడు రంగుల్లో లభ్యమవుతోంది. హై స్ట్రీట్ గోల్డ్, ఎవెన్యూ వైట్, ఆర్కేడ్ గ్రే, ఒపెరా బ్లూ, డౌన్ టౌన్ రెడ్, హార్బర్ బ్లూ, కాస్మో బ్లాక్ రంగుల్లో లభ్యమవుతుంది. ఈ వేరియంట్ల ధరలను టాటా మోటార్స్ సవరించింది. అలానే ఎంపిక చేసిన కొందరు కస్టమర్లకు ప్రైస్ ప్రొటెక్షన్ కూడా ఆఫర్ చేస్తుంది.