భారతదేశంలో విమానం ఎక్కాలి అనేది దాదాపు ప్రతి సాధారణ మధ్యతరగతి వ్యక్తి కల. ఆ కలను మేము సాకారం చేస్తామంటూ సోమవారం స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ తరఫున విమానం టికెట్లను సులభతర వాయిదా పద్ధతి(EMI)లో అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వార్త ఎందరికో కిక్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.
మధ్యతరగతి వ్యక్తి అనగానే ఏ వస్తువైనా ఈఎంఐలో కొనడం అలవాటు. అదే లాజిక్ తో ఈ పద్ధతి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రయాణం చేసి ఆ టికెట్ విలువను మూడు, ఆరు, 12 నెలల వాయిదాల్లో చెల్లించవచ్చు. టికెట్ బుకింగ్ ప్రయాణికులు తమ యూపీఐ ఐడీ ద్వారా తొలి వాయిదా చెల్లిస్తే.. ఆ తర్వాత ప్రతి నెల అదే యూపీఐ ఐడీ నుంచి వాయిదా మొత్తం కట్ అవుతుందని వెల్లడించారు. ఈఎంఐ పద్ధతిని అవైల్ చేసుకోవడానికి డెబిట్, క్రెడిట్ కార్డులను మాత్రం అనుమతించమని స్పష్టం చేసింది. కేవలం యూపీఐ ఐడీ ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. లాంఛింగ్ ఆఫర్ కింద మొదటి 3 నెలల వాయిదాలపై అదనపు భారం మోపబోమని తెలిపింది. బుకింగ్ సమయంలో ఆధార్ లేదా వర్చువల్ ఐడీ, పాన్ నంబరు ఇవ్వాలి. ఆ తర్వాత వన్ టైమ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాతే ప్రయాణికుడి వివరాలు ధ్రువీకరిస్తామని తెలిపింది. స్పైస్ జెట్ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.