లోన్లు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా, చట్టానికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్న వారిని పట్టుకోవడం కోసం క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి 'సెబీ' కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసెట్ డిఫాల్టర్ల సమాచారం తెలిపిన వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు 515 మంది ఎగవేతదార్ల జాబితాను విడుదల చేసింది. వీరికి సంబంధించిన సమాచారాన్నే మీరు తెలియజేయాలి.
లోన్లు తీసుకోవడం.. వాటిని తిరిగి చెల్లించకపోవడం.. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఇది సదా మాములే. ఆపై చట్టం నుండి తప్పించుకోవడానికి బిజినెస్ మ్యాన్స్ విదేశాలకు పారిపోతుంటే, రాజకీయ నాయకులు అధికార పార్టీల్లోకి వలసలు పోతుంటారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చూశాం.. విజయ మాల్యా, నీరవ్ మోడీ, నీరవ్ చోక్సి అలాంటి వారే. ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎందరో ఉన్నారు. అలాంటి వారికి క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’ పరోక్షంగా హెచ్చరికలు పంపింది.
లోన్లు తీసుకొని కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్న రుణ ఎగవేత దారుల కోసం క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసెట్ డిఫాల్టర్ల సమాచారం తెలిపిన వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ రివార్డును రెండు దశల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది. మొదట డిఫాల్టర్ అసెట్ రిజర్వ్ ధరలో 2.5 శాతం లేదా రూ.5 లక్షల్లో ఏది తక్కువైతే అది చెల్లించనుండగా, తుది రివార్డు కింద రికవరీ అయిన బకాయిల్లో గరిష్ఠంగా 10 శాతం లేదా రూ.20 లక్షల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనుంది.
సెబీ ప్రకటన ప్రకారం.. అన్ని రకాల మార్గాలను ఉపయోగించినా బకాయిలు వసూలు కాని యెడల, ఆ ఎగవేతదారు ఆస్తులకు సంబంధించి విశ్వసయనీయ సమాచారం అందించే వ్యక్తి నజరానా పొందేందుకు అర్హులు. సమాచారం ఇచ్చే వ్యక్తి వివరాలను, నజరానా మొత్తాన్ని గోప్యంగా ఉంచనున్నట్లు సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు 515 మంది ఎగవేతదార్ల జాబితాను విడుదల చేసింది. వీరికి సంబంధించిన సమాచారాన్నే మీరు తెలియజేయాలి. జాబితాలోని డిఫాల్టర్లపై.. ఎవరి మీద ఎంత నజరానాకు అర్హత ఉందనే అంశంపై సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈనెల 8 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. కావున.. డిఫాల్టర్ల ఆస్తులకు సంబంధించి మీకు ఎలాంటి వివరాలు తెలిసినా, అవి సెబీకి తెలియజేసి రూ.20 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఎగవేతదార్ల విషయంలో సెబీ నిర్ణయం సరైనదేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Get rewards of up to Rs 20 lakh from #SEBI for information, list of 515 defaulters releasedhttps://t.co/2CCIBxPsnW
— DNA (@dna) March 10, 2023