ఏ వ్యాపారం చేసినా గానీ రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే రిస్క్ ఫేస్ చేసిన వారినే గెలుపు వరిస్తుంది అని అంటారు. నిజమే కానీ అందరూ రిస్క్ తీసుకోలేరు. బాధ్యతలు కొన్ని ఆపేస్తుంటాయి. మీ దగ్గర కొంత డబ్బు ఉండి ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే మీకు ఈ కథనం బాగా ఉపయోగపడుతుంది.
చాలా మంది ఓవర్ నైట్ లక్షాధికారులు అవ్వాలని, కోటీశ్వరులు అవ్వాలని వివిధ పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటారు. కొంతమంది నెమ్మదిగా ధనవంతులం అవుదాములే అని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతుంటారు. కొంతమంది అంత టైం లేదని చెప్పి స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంటారు. బయట 5 నుంచి 10 లక్షలు అప్పు తెచ్చి మరీ స్టాక్స్ లో పెట్టేవారు ఉంటారు. పెట్టి చేతులు కాల్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా సరే 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండి పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లైతే కనుక ఏ మాత్రం సంకోచించకుండా ఆభరణాల మీద పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే బంగారు, వెండి ఆభరణాల మీద ఉన్న లాభం మరెక్కడా ఉండదు. అది కూడా రిస్క్ లేని పెట్టుబడి.
కొంతమంది స్థలాల మీద కూడా పెట్టుబడి పెడతారు. కానీ కనీసం ఏడాది అయినా పడుతుంది దాని రేటు పెరగాలంటే. అదే ఆభరణాల మీద అయితే నెల రోజుల్లోనే దశ తిరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ బంగారం కంటే వెండి మీద పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు భారీగా పడిపోతున్నా వెండి మాత్రం బాహుబలిలా నిలబడిపోతుంది. తగ్గినా గానీ త్వరగా మళ్ళీ పెరుగుతుంది. మే 5న కిలో వెండి రూ. 83,700 ఉంది. ప్రస్తుతం అంటే జూన్ 15న 78,500 ఉంది. 40 రోజుల్లో రూ. 5,200 తగ్గింది. ఇప్పుడు కనుక మీరు కిలో 78,500 చొప్పున కొనుగోలు చేస్తే మీకు కనీసం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల లాభం పొందే అవకాశం ఉంటుంది.
మీరు కనుక రూ. 5,50,000 పెట్టుబడి పెట్టి 7 కిలోల వెండి కొనుగోలు చేస్తే కనుక నెల, రెండు నెలల్లో దాని విలువ రూ. 5,88,000 అవుతుంది. అంటే మీకు రెండు నెలల్లో రూ. 38 వేలు లాభం వస్తుంది. అదే మీ దగ్గర రూ. 9 లక్షల 42 వేలు పెట్టి 12 కిలోల వెండి కొనుగోలు చేస్తే కనుక రూ. 66 వేలు లాభం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రూ. 78,500 ఉన్న వెండి ధర ఖచ్చితంగా గరిష్ట ధరకు అంటే రూ. 83700 కి చేరుకుంటుంది. అంతకంటే ఎక్కువ ధరకు కూడా చేరుకుంటుంది. అదే 10 కిలోలు కొంటే కనుక (7,85,000 పెట్టుబడితో) రూ. 8,40,000 అవుతుంది. అంటే 55,000 లాభం పొందవచ్చు. ఇదెలా సాధ్యం అంటే మార్చి నెలలో కనిష్టంగా రూ. 67,300 ఉన్న కిలో వెండి.. ఏప్రిల్ నెలలో ఏకంగా 83 వేలకు చేరుకుంది. మే నెలలో 83,700 కి చేరుకుంది. మళ్ళీ తగ్గిపోయింది.
ఇదంతా రెండు నెలల వ్యవధిలో జరిగింది. ఒక్క నెలలోనే రూ. 15 వేలు పెరిగింది. అయితే ప్రతిసారీ ఇలానే జరుగుతుందా అంటే మరొక ఉదాహరణ చెప్పుకుందాం. మే 5న గరిష్ట ధర రూ. 83,700 ఉంటే అదే నెలలో 26వ తేదీన కనిష్ట ధర రూ. 76,500 ఉంది. రూ. 7,200 మేర వెండి ధర పతనమైంది. మరి పతనమైన వెండి మళ్ళీ పెరిగిందా? లేదా? ఖచ్చితంగా పెరుగుతుంది. మే 26న రూ. 76,500 ఉంటే ఇప్పుడు రూ. 78,500 ఉంది. 20 రోజుల్లో రూ. 2 వేలు పెరిగింది. ఇంకో పది రోజులు ఆగితే ఈ ధర 80 వేలకు చేరుకోకుండా ఉంటుందా? రేటు పెరిగిన తర్వాతే అమ్ముకోవచ్చు. ఈ లెక్కన మీరు 5 నుంచి 10 లక్షలు వెండి మీద పెట్టుబడి పెడితే ఎంత కాదన్న కనీసం నెలలో రూ. 50 వేలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
అదృష్టం కలిసి రాలేదు అయినా సరే కనీసం నెలలో రూ. 10 వేలు సంపాదించుకోవచ్చు. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యక్తి జూన్ 1న 10 లక్షలు పెట్టి కిలో రూ. 77,600 చొప్పున 10 కిలోలు కొనుగోలు చేశాడు. 15న కిలో వెండి ధర రూ. 78,500 అయ్యింది. జూన్ 15న అమ్మేయాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తికి రూ. 9 వేలు లాభం వచ్చినట్టు. 15 రోజుల్లో రూ. 9 వేలు లాభం అంటే రోజుకి రూ. 600. బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువే ఇది. అదే 5 లక్షలు ఉంటే రూ. 5 వేలు లాభం పొందవచ్చు. అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్, ఇంకేదో మార్కెట్లో పెట్టడం కంటే అవగాహన లేకున్నా వెండి మీద పెట్టుబడి పెట్టడం మంచిది. రేటు తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మడం చేస్తే చాలు.
ఆ 10 లక్షలను రెండు రూపాయల వడ్డీకి తిప్పుకుంటే నెలకు రూ. 20 వేలు వస్తాయి కదా అంటే అసలు తిరిగి వస్తుందో లేదో సందేహమే. రిస్క్ ఎక్కువ. డాక్యుమెంట్స్ తీసుకుని అప్పు ఇస్తే పర్లేదు కానీ ఏమీ లేకుండా ఒట్టి ప్రామిశరీ నోటు మీద ఇస్తే ఇక అంతే సంగతులు. వడ్డీకి తిప్పుకున్నా గానీ నెలకు రూ. 20 వేలే వస్తాయి కానీ వెండి మీద పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ వస్తున్నాయి కదా. పైగా రిస్క్ లేని పెట్టుబడి. ఒకవేళ మీరు కొన్నాక పెరగడానికి 6 నెలలు పట్టినా గానీ (6 నెలలు పట్టడం జరగదు, కానీ అనుకుంటే కనుక ) 6 నెలల్లో 50 వేలు లాభం అంటే నెలకు రూ. 8 వేలు మిగిలినట్టే. అదృష్టం బాగుంటే నెలలోనే రేటు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
ఈ లెక్కన మీ దగ్గర ఒక 8 లక్షలు ఉంటే నెలకు రూ. 50 వేలు వరకూ సంపాదించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వడ్డీకి తిప్పుకుంటే తిరిగి ఇస్తారో లేదో గానీ ఇలా ఆభరణాలు కొనుగోలు చేస్తే మంచి లాభాలు ఉంటాయి. రిస్క్ ఉండదు. వెండి అయినా, బంగారం అయినా పడిపోయినా గానీ ఎక్కడైతే పడిపోయిందో మళ్ళీ ఆ రేటుకి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుందనేది నిపుణుల మాట. మరి లక్షలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనీసం లక్ష నుంచి 80 వేలు ఉన్నా కూడా రూ. 1000 నుంచి రూ. 6000 లాభం పొందవచ్చు. నెల రోజులు పట్టచ్చు, రెండు నెలలు పట్టచ్చు. తక్కువ అమౌంట్ మీద పెద్దగా కలిసి వచ్చినట్టు అనిపించదు.
గమనిక: ఈ కథనం మీకు ఉపయోగపడడానికి మాత్రమే. పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించడానికి కాదు. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు, సూచనలు పాటించవలసిందిగా మనవి.